
పాకిస్థాన్‌లో భారీ పేలుడు..పోలీసు అధికారితో సహా 52 మంది మృతి
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో శుక్రవారం జరిగిన పేలుడులో 52 మంది మరణించగా,130 మందికి పైగా గాయపడ్డారు.
స్థానిక మీడియా నివేదించిన ప్రకారం పేలుడులో మరణించిన వారిలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP) కూడా ఉన్నారు.
బలూచిస్థాన్‌లోని మస్తుంగ్ జిల్లాలోని మసీదులో ముహమ్మద్ ప్రవక్త జయంతిని పురస్కరించుకుని అక్కడ ప్రజలు ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహిస్తుండగా సమీపంలో పేలుడు సంభవించింది.
మస్తుంగ్ అసిస్టెంట్ కమీషనర్ అట్టా ఉల్ మునిమ్ మసీదు వద్ద భారీ పేలుడు సంభవించినట్టు పేర్కొన్నారు.
గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది.
ఈ నెల ప్రారంభంలో జరిగిన పేలుళ్లలో జమియాత్ ఉలేమా-ఎ-ఇస్లాం ఫజల్ (JUI-F) నాయకుడు హఫీజ్ హమ్దుల్లాతో సహా పలువురు గాయపడ్డారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
పాకిస్థాన్‌లో భారీ పేలుడు..పోలీసు అధికారితో సహా 52 మంది మృతి
पाकिस्तान में फिर हुआ बम धमाका, 52 लोगों की मौत, 130 जख्मी
— News24 (@news24tvchannel) September 29, 2023
◆ आतंकियों ने बलूचिस्तान में एक मस्जिद को निशाना बनाया#Pakistan | #Balochistan | Bomb Blast in Pakistan pic.twitter.com/vHsE5XfGuI