
Pakistan:భారత్ దెబ్బ.. చిన్నాభిన్నమైన పాక్ ఆర్థిక వ్యవస్థ .. అప్పుకోసం అర్థిస్తూ ట్వీట్
ఈ వార్తాకథనం ఏంటి
భారత సైన్యం చర్యలకు పాకిస్థాన్ షాక్‌కు గురైంది. గురువారం భారతదేశం ఆకస్మికంగా చేసిన దాడులు పాకిస్తాన్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా కూలిపోయాయి. ఇప్పుడే అవి తిరిగి పుంజుకునే అవకాశం కనిపించడం లేదు.
తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్న పాక్ ఆర్థిక వ్యవస్థ తిరిగి కోలుకునే అవకాశం లేకుండా సంక్షోభంలో కూరుకుపోయింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
చేయి చాచిన పాకిస్థాన్
Govt of Pakistan appeals to International Partners for more loans after heavy losses inflected by enemy. Amid escalating war and stocks crash, we urge international partners to help de-escalate. Nation urged to remain steadfast. @WorldBank #IndiaPakistanWar #PakistanZindabad
— Economic Affairs Division, Government of Pakistan (@eadgop) May 9, 2025
వివరాలు
అంతర్జాతీయ భాగస్వాములు తమకు సహాయం చేయాలని విజ్ఞప్తి
ఈ పరిస్థితుల్లో ప్రపంచ సమాజం ముందు మద్దతు కోరుతూ పాకిస్తాన్ భిక్షాపాత్ర పట్టింది.
భారత్ దాడులతో తమ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా నాశనం అయిందని పేర్కొంటూ, ప్రపంచ బ్యాంక్‌ను ట్యాగ్ చేస్తూ పాకిస్తాన్ ఆర్థిక వ్యవహారాల శాఖ 'X' వేదికగా చేసిన పోస్ట్ అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది.
భారత్‌తో తలపడటమే తమకు అన్ని కోణాల్లో నష్టాన్ని తెచ్చిందని పేర్కొన్నారు.
యుద్ధ పరిస్థితి తీవ్రమవుతోందని, తమ వద్ద ఉన్న అవసరమైన నిల్వలు త్వరగా తగ్గిపోతున్నాయని వెల్లడించారు.
ఈ ఉద్రిక్తత పరిస్థితిని తగ్గించేందుకు అంతర్జాతీయ భాగస్వాములు తమకు సహాయం చేయాలని కోరారు.
వివరాలు
మన ఒక రూపాయి విలువ పాక్ రూపాయిలో దాదాపు మూడు రూపాయిలతో సమానం
కాగా, కోవిడ్ మహమ్మారి అనంతరం పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది.
ఇప్పటికే ఆ దేశం భారీగా అప్పుల్లో చిక్కుకుంది. ప్రస్తుతానికి పాక్ వద్ద ఉన్న విదేశీ మారక నిల్వలు కేవలం 15 బిలియన్ డాలర్లుగా ఉండగా, అదే సమయంలో భారత్ వద్ద ఇవే నిల్వలు 688 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.
అంతేకాకుండా, పాకిస్తాన్ రూపాయి విలువ కూడా భారీగా పడిపోయింది.
భారత రూపాయితో పోలిస్తే, పాకిస్తాన్ రూపాయి చాలా నీచమైన స్థాయిలో ఉంది. ప్రస్తుతం మన ఒక రూపాయి విలువ పాక్ రూపాయిలో దాదాపు మూడు రూపాయిలతో సమానం.