Page Loader
Pakistan: పాకిస్థాన్‌లో రెచ్చిపోయిన ఆకతాయిలు; 4చర్చిలు ధ్వంసం 
Pakistan: పాకిస్థాన్‌లో రెచ్చిపోయిన ఆకతాయిలు; 4చర్చిలు ధ్వంసం

Pakistan: పాకిస్థాన్‌లో రెచ్చిపోయిన ఆకతాయిలు; 4చర్చిలు ధ్వంసం 

వ్రాసిన వారు Stalin
Aug 16, 2023
05:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్‌లోని పంజాబ్‌ ప్రావిన్స్‌లో ఆకతాయిలు రెచ్చిపోయారు. నాలుగు చర్చిలు, వాటి చుట్టూ ఉన్న కొన్ని భవనాలు ధ్వంసం చేసి, అక్కడ అందినకాడికి దోచుకెళ్లారు. దైవదూషణకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ క్రైస్తవ క్లీనర్ ఇంటిని ఆకతాయిలు కూల్చివేశారు. జరన్‌వాలా తహసీల్‌లో జరిగిన ఈ దాడిలో బైబిళ్లను అపవిత్రం చేశారని, క్రైస్తవులను హింసించారని చర్చ్ ఆఫ్ పాకిస్థాన్ మోడరేటర్ బిషప్ ఆరోపించారు. ఇసా నగ్రి ప్రాంతంలో ఉన్న సాల్వేషన్ ఆర్మీ చర్చి, యునైటెడ్ ప్రెస్బిటేరియన్ చర్చి, అలైడ్ ఫౌండేషన్ చర్చి, షెహ్రూన్‌వాలా చర్చిలపై దాడులు జరిగినట్లు జరన్‌వాలా పాస్టర్ ఇమ్రాన్ భట్టి పేర్కొన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

చర్చిపై దాడి చేస్తున్న దృశ్యాలు

పాక్

100మంది ఒక్కసారిగా చర్చిలపై దాడి

తన సెల్‌ఫోన్‌లో దైవదూషణ చిత్రాలను కలిగి ఉన్న 22 ఏళ్ల క్రైస్తవ వ్యక్తికి కోర్టు మరణశిక్ష విధించిన రెండు నెలల తర్వాత ఈ సంఘటన జరిగింది. దాదాపు 100మంది ఒక్కసారిగా చర్చిలపై దాడిచేసినట్లు వీడియోల ద్వారా తెలుస్తోంది. దాడి చేసిన వారిలో కొందరు కర్రలతో పాటు ఆయుధాలు కలిగి ఉన్నారు. రెండు చర్చిల్లో దోపిడీకి పాల్పడిన దుండగులు, వాటి వెలుపల కొన్నింటిని తగులబెట్టారు. ఈ ఘటనను దూరం నుంచి చిత్రీకరించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ దాడులపై చర్చ్ ఆఫ్ పాకిస్థాన్‌కు మోడరేటర్ బిషప్‌గా ఉన్న ఆజాద్ మార్షల్ ఆవేదన ట్విట్టర్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

పాకిస్థాన్ బిషప్‌ ఆజాద్ మార్షల్ చేసిన ట్వీట్