
Pakistan: యుద్ధానికి పాక్ సిద్ధం.. 'బన్‌యన్ ఉల్ మర్సూస్' పేరుతో ఆపరేషన్ ప్రారంభం
ఈ వార్తాకథనం ఏంటి
భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకీ ముదురుతున్నాయి. గురువారం సాయంత్రం నుంచి ఇరు దేశాలు పరస్పర దాడుల్లో నిమగ్నమవుతున్నాయి.
ముఖ్యంగా శుక్రవారం రాత్రి నుంచి ప్రత్యక్ష యుద్ధ దాడులకు దిగడంతో సరిహద్దుల్లో బాంబుల శబ్దాలు మోగిపోతున్నాయి.
ఈ నేపథ్యంలో శనివారం తెల్లవారుజామున పాకిస్తాన్ ఆర్మీ ఊహించని సంచలన నిర్ణయం తీసుకుంది. భారత్‌పై పూర్తి స్థాయి మిలిటరీ ఆపరేషన్ చేపడుతున్నట్లు పాకిస్తాన్ అధికారికంగా ప్రకటించింది.
శనివారం ఉదయం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఈ ఆపరేషన్‌కు 'బన్‌యన్ ఉల్ మర్సూస్' (Banyan-Ul-Marsoos) అనే పేరు పెట్టినట్లు వెల్లడించింది.
Details
భారత్ కీలక ప్రకటన చేసే అవకాశం
ఈ ప్రకటనతో పాక్ భారత్‌పై దాడుల ఉద్ధృతి మరింత పెంచనుందని సమాచారం.
ఇక భారత వైపు నుంచి కూడా తక్షణమే స్పందన రానుంది. మరికాసేపట్లో భారత ఆర్మీ ప్రెస్‌మీట్ ఏర్పాటు చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం.
ఆ ప్రెస్‌మీట్‌లో భారత ఆర్మీ కూడా కీలక ప్రకటన చేయనుందన్న ఊహాగానాలు కొనసాగుతున్నాయి.
ఇదిలా ఉండగా, ఉగ్రవాదాన్ని ఆశ్రయించిన పాకిస్థాన్ ఇప్పుడు భారత్‌పై ప్రత్యక్ష యుద్ధానికి దిగడంతో అంతర్జాతీయంగా ఒంటరిగా మిగిలిపోయింది.
భారత్ యుద్ధ సామర్థ్యం, మిలిటరీ శక్తి దృష్ట్యా పాకిస్తాన్ తట్టుకోగలదా? లేక భారత్ ప్రతీకార దాడుల్లో దెబ్బతింటుందా? అన్నది ఇప్పుడు అందరిలో ఆసక్తికర చర్చగా మారింది.