
Pakistan: సింధూ నదిపై నిర్మాణం చేపడితే ధ్వంసం చేస్తాం : పాక్ రక్షణ మంత్రి హెచ్చరిక
ఈ వార్తాకథనం ఏంటి
పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. ఈ దాడిలో 26 మంది పర్యాటకులు మృతి చెందారు.
ఈ నేపథ్యంలో భారత్ పాక్‌పై వరుసగా కఠిన చర్యలు తీసుకుంటోంది. వాటిలో భాగంగా సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం కీలకంగా మారింది.
ఈ చర్య పాక్‌ను తీవ్రంగా కలచివేసింది. ఇందుకు స్పందించిన పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సింధూ నదిపై భారత్ ఏదైనా నిర్మాణం చేపడితే దాన్ని ధ్వంసం చేస్తామంటూ హెచ్చరించారు.
ఓ స్థానిక మీడియా సంస్థతో ఆయన మాట్లాడారు. భారత్ చర్యలపై అగ్రెసివ్‌గా స్పందిస్తున్న ఆయన వ్యాఖ్యలు ఆందోళన కలిగించేలా ఉన్నాయి.
ఈ క్రమంలో భారత్ తొలిసారిగా సింధూ జలాల ఒప్పందాన్ని పక్కన పెట్టింది.
Details
నీరు పారకపోతే రక్తం పారుతుంది
ఇప్పటివరకు జరిగిన ద్వైపాక్షిక విభేదాల్లో ఇంత స్థాయిలో నీటి ఒప్పందంపై కేంద్రం చర్య తీసుకోవడం ఇదే మొదటిసారి.
పాక్ వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉండనుందని విశ్లేషకులు చెబుతున్నారు.
ఇక గతంలోనూ పాక్ నేతలు సింధూ జలాల అంశాన్ని రాజకీయ ఆయుధంగా మార్చుకునే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా పాక్ మాజీ విదేశాంగ మంత్రి భిలావల్ భుట్టో జర్దారీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు గురయ్యాయి.
'సింధూ నదిలో నీరు పారకపోతే రక్తం పారుతుందందూ ఆయన చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఆ దేశ వైఖరిని బట్టబయలుచేశాయి.
Details
ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు
సింధూ నదిపై తమకే హక్కులున్నాయంటూ, తమ నాగరికతకు తామే రక్షకులమంటూ పాక్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశముందని పరిశీలకులు భావిస్తున్నారు.
ఇలా చూస్తే, పహల్గాం దాడి తరువాత భారత్ తీసుకుంటున్న చర్యలు పాక్‌పై దీర్ఘకాలిక ప్రభావం చూపనున్నాయి.