LOADING...
Pakistan: పాకిస్థాన్‌లో అండర్ వరల్డ్ డాన్ అమీర్ బాలాజ్ టిప్పు హతం 
Pakistan: పాకిస్థాన్‌లో అండర్ వరల్డ్ డాన్ అమీర్ బాలాజ్ టిప్పు హతం

Pakistan: పాకిస్థాన్‌లో అండర్ వరల్డ్ డాన్ అమీర్ బాలాజ్ టిప్పు హతం 

వ్రాసిన వారు Stalin
Feb 19, 2024
10:10 am

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్‌లోని లాహోర్‌లో అండర్ వరల్డ్ డాన్ అమీర్ బాలాజ్ టిప్పు దారుణ హత్యకు గురయ్యాడు. లాహోర్‌లో ఓ వివాహ వేడుకకు హాజరయ్యేందుకు చుంగ్ ప్రాంతానికి వచ్చిన సమయంలో గుర్తు తెలియని వ్యక్తి అతనిపై కాల్పులు జరిపాడు. దీంతో బాలాజ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే జిన్నా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. అండర్ వరల్డ్ డాన్ ఆరిఫ్ అమీర్ అలియాస్ టిప్పు ట్రక్కన్‌వాలా కుమారుడే అమీర్ బాలాజ్. 2010లో ఆరిఫ్‌ హత్యకు గురయ్యాడు. అమీర్ బాలాజ్ కూడా పాత కక్షలకు బలయ్యాడు. అమీర్ బాలాజ్ ఫ్యామిలీలో అందరూ పేరు మోసిన అండర్ వరల్డ్ డాన్‌‌లే కావడం గమనార్హం. అమీర్ బాలాజ్‌పై దాడి చేసిన వ్యక్తిని అతని అనుచరులు కాల్చి చంపారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కాల్పులు జరిపిన స్థలంలోని దృశ్యాలు