Peru: పెరూలో ఘోర రోడ్డు ప్రమాదం..బస్సు కాలువలో పడి 23మంది మృతి
దక్షిణ అమెరికా దేశం పెరూలో సోమవారం బస్సు కాలువలో పడి కనీసం 23 మంది మరణించారు. ఉత్తర పెరూలో ఈ ప్రమాదం జరిగింది. ఉత్తర పెరూలో పర్వత రహదారి నుండి లోయలోకి బస్సు పడిపోయింది, కనీసం 23 మంది మరణించగా, డజనుకు పైగా గాయపడినట్లు స్థానిక అధికారులు తెలిపారు. గుంతలు పడిన రోడ్డుపై ఆదివారం అర్థరాత్రి ఈ ఘటన జరిగినట్లు అధికారి ఓల్గా బోబడిలా తెలిపారు. బస్సు దాదాపు 200 మీటర్ల (సుమారు 650 అడుగులు) లోతైన లోయలో పడిపోయింది.
బస్సులో 50 మందికి పైగా ప్రయాణికులు
ఈ బస్సులో 50 మందికి పైగా ప్రయాణికులు ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో బస్సు నది ఒడ్డున పడిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న కొందరు నీటిలో కొట్టుకుపోయారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న తరువాత, రెస్క్యూ వర్కర్లు, అగ్నిమాపక సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకున్నారని, అక్కడి నుండి గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించినట్లు మున్సిపల్ కార్పొరేషన్ అధికారి జైమ్ హెర్రెరా తెలిపారు.
దేశంలో 3100 మందికి పైగా మరణాలు నమోదయ్యాయి
సెలెండిన్ మున్సిపాలిటీ 48 గంటల సంతాప దినాలు ప్రకటించింది. అధిక వేగం, పేలవమైన రహదారి పరిస్థితులు, సిగ్నల్స్ లేకపోవడం, ట్రాఫిక్ నియమాలను సరిగ్గా అమలు చేయకపోవడం వల్ల పెరూ రోడ్లపై తరచుగా ప్రమాదాలు జరుగుతాయి. గత ఏడాది దేశంలో ట్రాఫిక్ ప్రమాదాల కారణంగా 3100 మందికి పైగా మరణాలు నమోదయ్యాయి. బస్సు రోడ్డు యోగ్యమైనదా లేదా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.