LOADING...
PIA: టేకాఫ్ సమయంలో విమానం చక్రం మిస్సింగ్.. ఏం జరిగిందంటే?
PIA: టేకాఫ్ సమయంలో విమానం చక్రం మిస్సింగ్.. ఏం జరిగిందంటే?

PIA: టేకాఫ్ సమయంలో విమానం చక్రం మిస్సింగ్.. ఏం జరిగిందంటే?

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 14, 2025
04:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (PIA)కు చెందిన ఓ దేశీయ విమానానికి ఊహించని సంఘటన ఎదురైంది. లాహోర్‌లో ల్యాండింగ్ సమయంలో ఒక చక్రం లేకపోవడం (Wheel Missing) గుర్తించడంతో కలకలం రేగింది. అయితే, ఎటువంటి ప్రమాదకరమైన ఘటన చోటుచేసుకోకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. పీఐఏ విమానం PK-306 కరాచీ నుంచి లాహోర్‌కు బయలుదేరింది. లాహోర్ విమానాశ్రయంలో దిగిన తర్వాత, కెప్టెన్ సాధారణ తనిఖీ నిర్వహించారు. అదే సమయంలో విమానం వెనుక భాగంలోని చక్రాల్లో ఒకటి మిస్ అయిందని గుర్తించారు. అయినప్పటికీ, విమానం సురక్షితంగా ల్యాండ్ అయినట్లు పీఐఏ అధికారులు ప్రకటించారు.

వివరాలు 

విచారణ ప్రారంభమైంది:  పీఐఏ 

ఈ ఘటనపై ఇప్పటికే విచారణ ప్రారంభమైనట్టు పీఐఏ ప్రకటించింది. విమానం కరాచీ నుంచి బయలుదేరే సమయంలోనే చక్రం మిస్సయిందా? లేక టేకాఫ్ సమయంలో ఊడిపోయిందా? అనే విషయంపై దర్యాప్తు జరుగుతోందని స్పష్టం చేసింది. అంతేకాకుండా, చక్రాన్ని ఎవరైనా దొంగిలించారా? అనే కోణంలోనూ విచారణ కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపారు.