
London: లండన్ విమానాశ్రయంలో ఘోర ప్రమాదం.. టేకాఫ్ అయిన వెంటనే కూలిన విమానం
ఈ వార్తాకథనం ఏంటి
లండన్ విమానాశ్రయంలో ఒక్కసారిగా విషాదం చోటుచేసుకుంది. విమానాశ్రయం నుంచి ఎగిరిన కొద్దిసేపటికే ఒక విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంతో వెంటనే మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి. ఘటన తాలుకా ప్రభావంతో విమానాల రాకపోకల్లో అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో సుమారు నాలుగు విమానాలను రద్దు చేసినట్టు విమానాశ్రయం అధికారికంగా ప్రకటించింది. అయితే ప్రమాదంలో విమానంలో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు? వారి ప్రస్తుత పరిస్థితి ఏంటి? అనే వివరాలను అధికారులు ఇప్పటివరకు వెల్లడించలేదు.
వివరాలు
ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది, అంబులెన్స్ బృందాలు
ఈ ఘటన ఆదివారం మధ్యాహ్నం సౌథెండ్ విమానాశ్రయంలో చోటుచేసుకున్నట్టు అధికారులు తెలిపారు. చిన్నవిమానం కూలిపోవడంతో వెంటనే అగ్నిమాపక సిబ్బంది, అంబులెన్స్ బృందాలు సహా అత్యవసర సేవలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. వారు మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. సాయంత్రం 4 గంటల సమయంలో ప్రమాదం జరిగినట్టు తమకు సమాచారం అందిందని పోలీసులు తెలిపారు. మరోవైపు ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.