Page Loader
Modi-Xi Jinping: బ్రిక్స్‌ వేదికగా.. మోదీ-జిన్‌పింగ్‌ ద్వైపాక్షిక చర్చలు 
బ్రిక్స్‌ వేదికగా.. మోదీ-జిన్‌పింగ్‌ ద్వైపాక్షిక చర్చలు

Modi-Xi Jinping: బ్రిక్స్‌ వేదికగా.. మోదీ-జిన్‌పింగ్‌ ద్వైపాక్షిక చర్చలు 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 23, 2024
06:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

రష్యాలోని కజన్‌లో జరుగుతున్న బ్రిక్స్ దేశాల 16వ శిఖరాగ్ర సదస్సులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, సరిహద్దులో శాంతి, సుస్థిరతను కాపాడుకోవడం ఇరు దేశాలకు ప్రాధాన్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.

వివరాలు 

సరిహద్దులో కుదిరిన ఏకాభిప్రాయాన్ని స్వాగతించిన ప్రధాని మోదీ  

''ఐదేళ్ల విరామం తరువాత, మేము అధికారికంగా సమావేశమవుతున్నాము. భారత్-చైనా సంబంధాలు ఇరు దేశాల ప్రజలకు మాత్రమే కాకుండా, ప్రపంచ శాంతి, సుస్థిరత, పురోగతికి కూడా కీలకమైనవని విశ్వసిస్తున్నాము. గత నాలుగేళ్లుగా సరిహద్దులో ఏర్పడిన వివాదాలపై ఇటీవల వచ్చిన ఏకాభిప్రాయాన్ని మనం స్వాగతిస్తున్నాము. సరిహద్దులో శాంతి,సుస్థిరతను కాపాడుకోవడం మన ప్రధాన బాధ్యతగా ఉండాలి. పరస్పర విశ్వాసం, గౌరవం, సున్నితత్వం మన సంబంధాలకు ఆధారంగా ఉండాలి,'' అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా, అధ్యక్షుడు జిన్‌పింగ్ కూడా సంబంధాల పటిష్టతను నొక్కి చెప్పారు.

వివరాలు 

చైనా, భారత్‌ల మధ్య సహకారం ప్రాముఖ్యతను నొక్కి చెప్పిన జిన్‌పింగ్  

ఈ సమావేశంలో చైనా, భారత్‌ల మధ్య సహకారం ప్రాముఖ్యతను అధ్యక్షుడు జిన్‌పింగ్ నొక్కి చెప్పారు. చైనా విడుదల చేసిన ప్రకటన ప్రకారం, చైనా, భారతదేశం మధ్య సానుకూల సంబంధాలను కొనసాగించడం ఇరు దేశాలు, వారి పౌరుల ప్రధాన ప్రయోజనాలకు అనుగుణంగా ఉందని జిన్‌పింగ్ అన్నారు. రెండు దేశాల మధ్య కమ్యూనికేషన్, సహకారాన్ని పెంచాలని ఆయన కోరారు.ఏవైనా వైరుధ్యాలు లేదా విభేదాలను సమర్థవంతంగా నిర్వహించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సమావేశం గురించి మీడియాతో మాట్లాడుతున్న విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌మిశ్రీ 

వివరాలు 

జిన్‌పింగ్‌తో భేటీ తర్వాత ప్రధాని మోదీ ఏం చెప్పారు? 

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను కలిసిన తర్వాత, ప్రధాని మోదీ ఎక్స్‌లో ఇలా రాశారు, 'కజాన్ బ్రిక్స్ సదస్సు సందర్భంగా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌ను కలిశారు. భారతదేశం-చైనా సంబంధాలు మన దేశాల ప్రజలకు, ప్రాంతీయ, ప్రపంచ శాంతి, స్థిరత్వానికి ముఖ్యమైనవి. పరస్పర విశ్వాసం, పరస్పర గౌరవం, సున్నితత్వం ద్వైపాక్షిక సంబంధాలకు మార్గనిర్దేశం చేస్తాయి". విశ్వాసం, గౌరవం,యు సున్నితత్వమే సంబంధాలకు ప్రాతిపదిక అని ప్రధాని మోదీ సమావేశంలో కూడా వివరించారు.

వివరాలు 

పరస్పర సహకారంతోనే సాధ్యం! 

భారత్-చైనాల మధ్య ఉన్న విభేదాలు,విరోధాలు నివారించేందుకు, ఇరుదేశాల మధ్య పరస్పర సహకారాన్ని అభివృద్ధి చేయడం అవసరమని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అభిప్రాయపడ్డారు. గత ఐదేళ్లలో మోదీ-జిన్‌పింగ్‌లు అధికారికంగా చర్చలు జరపడం ఇదే తొలిసారి. వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి కొన్నేళ్లుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ముగింపు పలుకుతూ, కీలక గస్తీ ఒప్పందం కుదిరిన నేపథ్యంలో ఈ సమావేశం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.