Meloni-Modi: బ్రెజిల్ వేదికగా మెలోనితో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు
బ్రెజిల్‌లోని రియో డి జనిరోలో జరుగుతున్న జీ20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ పలు దేశాధినేతలతో సమావేశమయ్యారు. ఈ క్రమంలో, ప్రధాని మోదీ ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతో ప్రత్యేకంగా చర్చలు నిర్వహించారు. రక్షణ, భద్రత, వాణిజ్యం, సాంకేతికత వంటి విభాగాల్లో పరస్పర సహకారంపై వీరు చర్చించారు. ఈ విషయాన్ని భారత ప్రధాని ఎక్స్ వేదికగా పంచుకుంటూ, భారత్-ఇటలీ మధ్య సఖ్యత గాఢమై, ప్రపంచ శ్రేయస్సుకు దోహదం చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. భారత ప్రధాని మోదీ, ఇటలీ ప్రధాని మెలోనీ మధ్య స్నేహసంబంధం ఈ చర్చల సమయంలో కూడా స్పష్టమైంది.
పరాగ్వే అధ్యక్షుడి స్వల్ప అస్వస్థత
వీరి ఫొటోలు సోషల్ మీడియాలో "మెలోడీ" (మెలోనీ+మోదీ) పేరుతో పలు మార్లు ట్రెండ్ అవుతుంటాయి. తాజా జీ20 సదస్సు సందర్భంగా ఈ "మెలోడీ" మూమెంట్ మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. జీ20 సదస్సులో పాల్గొన్న పరాగ్వే అధ్యక్షుడు శాంటియాగో పెనా స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, పూర్తి స్థాయి వైద్య పరీక్షల ఫలితాలు రావాల్సి ఉందని పరాగ్వే ప్రథమ మహిళ లెటీసియా ఒకాంపోస్ తెలిపారు.