AI Project: ఏఐ సాయంతో క్యాన్సర్‌కు 48 గంటల్లోనే వ్యాక్సిన్ తయారీ
ఈ వార్తాకథనం ఏంటి
టెక్నాలజీ దిగ్గజాలు ఓపెన్ ఏఐ, సాఫ్ట్ బ్యాంక్, ఒరాకిల్ సంయుక్తంగా ఒక ప్రగతిశీల కృత్రిమ మేధ ప్రాజెక్టును ప్రారంభించాయి.
ఈ ప్రాజెక్ట్ ముఖ్యంగా ప్రాణాంతక క్యాన్సర్‌ను కూడా నయం చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉండనుందని ప్రచారం జరుగుతోంది.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఈ ప్రాజెక్ట్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్, ఒరాకిల్ సీటీఓ ల్యారీ ఎల్లిసన్, సాఫ్ట్ బ్యాంక్ సీఈఓ మసయోషి సన్ పాల్గొన్నారు.
ఈ కృత్రిమ మేధ సాయంతో క్యాన్సర్‌ను 48 గంటల్లోనే గుర్తించి, వెంటనే వ్యాక్సిన్‌ను తయారు చేయడం సాధ్యమవుతుందని తెలిపారు.
Details
ఈ ప్రాజెక్టు వల్ల లక్షలాది ఉద్యోగాలు
ఈ భాగస్వామ్యం ద్వారా ఓపెన్ ఏఐ, సాఫ్ట్ బ్యాంక్, ఒరాకిల్ సంయుక్తంగా 'స్టార్‌గేట్' అనే కొత్త వెంచర్‌ను ప్రారంభించాయి.
ఈ కొత్త కంపెనీ అమెరికాలో 500 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాలని, టెక్సాస్‌లో పెద్ద డేటా సెంటర్లను ఏర్పాటు చేయాలని ట్రంప్ ప్రకటించారు.
ప్రస్తుతం టెక్సాస్‌లో 10 డేటా సెంటర్ల నిర్మాణం జరుగుతుంది. త్వరలో ఈ సంఖ్య 20కి పెరిగిపోతుంది.
ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ మాట్లాడుతూ ఈ ప్రాజెక్ట్ అనేక లక్షల ఉద్యోగాలు సృష్టిస్తుందని, క్యాన్సర్‌ను త్వరగా గుర్తించడమే కాకుండా, నయం కూడా చేస్తుందని తెలిపారు.
సాఫ్ట్ బ్యాంక్ సీఈఓ మసయోషి ఈ ప్రాజెక్ట్‌ను అమెరికా స్వర్ణ యుగం ప్రారంభంగా అభివర్ణించారు.
Details
ఏఐ సాయంతో ట్యూమర్స్‌ను ముందుగానే గుర్తించవచ్చు
అందులో భాగంగా ఒరాకిల్ సీటీఓ ల్యారీ ఎల్లిసన్ ఆరోగ్య ప్రయోజనాలను వివరించారు.
క్యాన్సర్‌కు సంబంధించిన చిన్న ట్యూమర్స్ రక్తంలో తేలియాడుతూ ఉంటాయి. ఆ ట్యూమర్స్‌ను ఏఐ సాయంతో ముందుగానే గుర్తించవచ్చు.
ఆ తర్వాత రక్తపరీక్ష ద్వారా క్యాన్సర్‌ను త్వరగా నిర్ధారించవచ్చు. కణాలను గుర్తించిన తరువాత, వ్యక్తికి ప్రత్యేకంగా టీకా అభివృద్ధి చేసి 48 గంటల్లోనే వ్యాక్సిన్ అందించవచ్చు.