President Biden: నరేంద్ర మోదీ ఉక్రెయిన్ పర్యటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రశంసలు.. ఆయన ఏమన్నారంటే . .?
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా ఉక్రెయిన్‌లో మోదీ పర్యటనను ప్రశంసిస్తూ, శాంతి సందేశాన్ని చాటారని, మానవతా సాయం పట్ల మద్దతు తెలిపారు. "పోలండ్, ఉక్రెయిన్‌లలో మోదీ ఇటీవలి పర్యటన గురించి ఫోన్‌లో చర్చించాం. ఆయన శాంతి, మానవతా మద్దతు అభినందనీయమైనవి. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, అభివృద్ధి కోసం కలిసి పనిచేయాలని మేము పునరుద్ఘాటించాం," అని బైడెన్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
మోదీ ఆగస్టు 23న ఉక్రెయిన్ పర్యటన
ఇరువురు నేతలు బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై కూడా చర్చించారు. హిందువులు సహా మైనారిటీల భద్రత లభించేలా చూడాల్సి ఉందని వారు పేర్కొన్నారు. ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై కూడా విస్తృతంగా అభిప్రాయాలు పంచుకున్నట్లు మోదీ ఎక్స్ వేదికగా వెల్లడించారు. గత నెలలో మోదీ చేసిన రష్యా పర్యటన పట్ల కొంత అసంతృప్తి వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో మోదీ ఆగస్టు 23న ఉక్రెయిన్ పర్యటన చేశారు. విమర్శలను సమర్థంగా ఎదుర్కొనే క్రమంలో మోదీ ఈ పర్యటన చేపట్టారని విశ్లేషకులు భావిస్తున్నారు. రష్యాతో చర్చలు జరిపి యుద్ధం ముగించేందుకు మార్గం కనుగొనాలని, భారత్ ఈ ప్రక్రియలో కీలక పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉందని నరేంద్ర మోదీ98 ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి సూచించారు.