Page Loader
భారత్-అమెరికా స్నేహం ప్రపంచంలోనే అత్యంత కీలకమైనది: బైడెన్
భారత్-అమెరికా స్నేహం ప్రపంచంలోనే అత్యంత కీలకమైనది: బిడెన్

భారత్-అమెరికా స్నేహం ప్రపంచంలోనే అత్యంత కీలకమైనది: బైడెన్

వ్రాసిన వారు Stalin
Jun 26, 2023
11:39 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటన నేపథ్యంలో తమ వ్యూహాత్మక సాంకేతిక భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించేందుకు రెండు దేశాలు అనేక ప్రధాన ఒప్పందాలపై సంతకాలు చేశాయని యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్ చెప్పారు. అమెరికా, భారత్ మధ్య స్నేహం ప్రపంచంలోనే అత్యంత గొప్పదని బైడెన్ అన్నారు. ఈ మేరకు బైడెన్ ట్వీట్ చేశారు. రెండు దేశాల మధ్య బంధం గతంలో కంటే బలంగా, దగ్గరగా, డైనమిక్‌గా ఉందని బైడెన్ పేర్కొన్నారు. బైడెన్ ట్వీట్‌పై ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. భారతదేశం-యూఎస్ మధ్య స్నేహం ప్రపంచానికి మంచిదని, ఇది మానవాళిని మరింత మెరుగ్గా మార్చుతుందన్నారు.

బైడెన్

విదేశీ పర్యటన ముగించుకొని భారత్ తిరిగి వచ్చిన మోదీ

అమెరికా అధ్యక్షుడి ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ మూడు రోజుల యూఎస్‌ పర్యటనకు వెళ్లారు. వైట్ హౌస్‌లో మోదీ బైడెన్ దంపతులు ఆతిథ్యం ఇచ్చారు. వైట్‌హౌస్ సౌత్ లాన్స్‌లో రికార్డు స్థాయిలో 7,000 మందితో మోదీకి స్వాగత కార్యక్రమం ఏర్పాటు చేశారు దాదాపు 500 మంది హాజరైన స్టేట్ డిన్నర్ మోదీని ఆకట్టుకుంది. ఈ పర్యటనలో భాగంగా దిగ్గజ టెక్నాలజీ కంపెనీల చీఫ్‌లతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. యూఎస్ పర్యటన అనంతరం ప్రధాని మోదీ ఈజిప్ట్‌కు వెళ్లారు. ఈజిప్టులో ప్రధాని మోదీ ఆ దేశ అత్యున్నత పురస్కారం ఇచ్చారు. ఈజిప్టు పర్యటన ముగించుకొని ఆదివారం అర్థరాత్రి భారత్ తిరిగి వచ్చారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

బైడెన్ ట్వీట్

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ప్రధాని మోదీ చేసిన ట్వీట్