Page Loader
Child Marriage: బాల్య వివాహాలను నిరోధించే బిల్లుకు అధ్యక్షుడు జర్దారీ గ్రీన్ సిగ్న‌ల్‌
బాల్య వివాహాలను నిరోధించే బిల్లుకు అధ్యక్షుడు జర్దారీ గ్రీన్ సిగ్న‌ల్‌

Child Marriage: బాల్య వివాహాలను నిరోధించే బిల్లుకు అధ్యక్షుడు జర్దారీ గ్రీన్ సిగ్న‌ల్‌

వ్రాసిన వారు Sirish Praharaju
May 30, 2025
01:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్‌లో బాల్యవివాహాల రద్దుకు సంబంధించి రూపొందించిన బిల్లుకు అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ ఆమోదం తెలిపారు. ఆయ‌న ఆ బిల్లుపై సంతకం చేయడం ద్వారా తుది ముద్ర వేసారు. ఈ బిల్లు ద్వారా 18 ఏళ్లకు లోపే బాలల పెళ్లిని చట్టబద్ధంగా రద్దు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పిల్లల హక్కులను కాపాడే ఉద్దేశంతో ఈ చట్టాన్ని రూపొందించారు.ఈ బిల్లు మే 27న అధ్యక్షుడి వద్దకు చేరింది. అప్పటికే పార్లమెంట్ ఉభయసభల నుంచి ఆ బిల్లు ఆమోదం పొందింది. అయితే, ఈ బిల్లుపై మతసంఘాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.

వివరాలు 

బిల్లు ఇస్లామిక్ చట్టాలకు విరుద్ధంగా ఉందన్న CII

ముఖ్యంగా కౌన్సిల్ ఆఫ్ ఇస్లామిక్ ఐడియాలజీ (CII) ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ బిల్లు ఇస్లామిక్ చట్టాలకు విరుద్ధంగా ఉందని వారు పేర్కొన్నారు. 18 ఏళ్ల లోపు వివాహాలను అత్యాచారంగా పరిగణించడం ఇస్లామిక్ నియమాలకు వ్యతిరేకమని సీఐఐ అభిప్రాయపడింది. అయినప్పటికీ, బాల్యవివాహాల నిషేధానికి సంబంధించిన నోటిఫికేషన్‌ను అధ్యక్ష భవనం అధికారికంగా విడుదల చేసింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 బాల్య వివాహాలు ర‌ద్దు బిల్లుకు పాక్ అధ్య‌క్షుడి గ్రీన్ సిగ్న‌ల్‌