Page Loader
ప్రపంచంలోనే అత్యంత ప్రజాధారణ పొందిన నేతల జాబితాలో ప్రధాని మోదీ నెంబర్ 1
ప్రపంచంలోనే అత్యంత ప్రజాధారణ పొందిన నేతల జాబితాలో ప్రధాని మోదీ నెంబర్ 1

ప్రపంచంలోనే అత్యంత ప్రజాధారణ పొందిన నేతల జాబితాలో ప్రధాని మోదీ నెంబర్ 1

వ్రాసిన వారు Stalin
Apr 03, 2023
04:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునక్‌లను వెనక్కి నెట్టి ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన నేతగా భారత ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి అవతరించారు. ప్రపంచ నాయకుల ప్రధాన నిర్ణయాలను ట్రాక్ చేసే గ్లోబల్ డెసిషన్ ఇంటెలిజెన్స్ సంస్థ అయిన మార్నింగ్ కన్సల్ట్ ఈ ర్యాంకింగ్‌లను విడుదల చేసింది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ట్విట్టర్‌లో ఈ జాబితాను పంచుకున్నారు 76శాతం రేటింగ్‌తో ప్రధాని మోదీ అగ్రస్థానంలో నిలిచినట్లు మార్నింగ్ కన్సల్ట్ తెలిపింది. మెక్సికన్ అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రాడోర్ రెండో స్థానంలో నిలిచారు.

ప్రధాని మోదీ

8వ స్థానంలో అమెరికా ప్రెసిడెంట్ బైడెన్

మార్చి 22 నుంచి 28 వరకు సేకరించిన డేటా ఆధారంగా ఈ సర్వే చేసినట్లు మార్నింగ్ కన్సల్ట్ తెలిపింది. ప్రతి దేశంలోని వయోజనులు ఏడురోజులు పాటు ఇచ్చిన రేటింగ్‌ ఆధారంగా ఓటింగ్ సగటును నిర్ణయించినట్లు మార్నింగ్ కన్సల్ట్ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. ప్రతి దేశంలో వయస్సు, లింగం, ప్రాంతం, కొన్ని దేశాలలో అధికారిక ప్రభుత్వ వనరుల ఆధారంగా సర్వే నిర్వహించిట్లు చెప్పింది 22మంది నాయకుల జాబితాలో చివరి స్థానంలో దక్షిణ కొరియా అధ్యక్షుడు యున్ సుక్-యోల్ ఉన్నారు. అతనికి 19 శాతం రేటింగ్ వచ్చింది. అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ 8వ ర్యాంక్‌తో ఈ ఏడాది ఒక స్థానానికి దిగజారారు.