kate middleton: క్యాన్సర్ చికిత్సలో గణనీయమైన పురోగతి సాధించిన బ్రిటన్ యువరాణి కేట్ మిడిల్టన్
వేల్స్ యువరాణి కేట్ మిడిల్టన్ క్యాన్సర్ చికిత్సలో మంచి పురోగతి సాధిస్తున్నట్లు సమాచారం. అయితే, ఆమె అధికారికంగా విధులకు తిరిగి రావడానికి తేదీని ఇంకా నిర్ణయించలేదు. అయితే, ఆమె "100% తిరిగి వస్తుందని" అని వానిటీ ఫెయిర్‌కి మూలాలు ధృవీకరించాయి. ప్రిన్సెస్ తన చికిత్స సమయంలో రాయల్ ఫౌండేషన్ సెంటర్ ఫర్ ఎర్లీ చైల్డ్ హుడ్,దాని వర్కింగ్ గ్రూప్ కార్యకలాపాల్లో పాల్గొనడం గమనార్హం. అయితే, ఇప్పుడు ఆమె ఆరోగ్యమే ఆమెకి ప్రధాన ప్రాధాన్యత.
యువరాణి కేట్ మిడిల్టన్ ఆరోగ్యం మెరుగుపడుతోంది
క్రిస్మస్ రోజు నుండి విధులు, బహిరంగ ప్రదర్శనలకు దూరంగా ఉన్న బ్రిటన్ యువరాణి కేట్ మిడిల్టన్, కీమోథెరపీ చికిత్సతో పురోగతి సాధిస్తున్నట్లు తెలుస్తోంది. వానిటీ ఫెయిర్ ప్రకారం, "ఆమె మందులను తట్టుకొని మెరుగ్గా ఉండటం చాలా మటుకు ఉపశమనం కలిగించే విషయం. ప్రిన్స్ విలియం, ఆమె తల్లిదండ్రులు,ఆమె సోదరి, సోదరుడు అందరూ ఆమెతోనే ఉన్నారు ." యువరాణి కేట్ విధులకు హాజరు కానప్పటికీ, ప్రిన్స్ విలియం రాజ విధులను నిర్వహిస్తున్నారు.
మెడికల్ బోర్డు ఆమోదం తర్వాత తిరిగి విధుల్లోకి..
సమాచారం ప్రకారం, యువరాణి తిరిగి రావడానికి ఇంకా గడువు ఉంది. యువరాణి కోలుకున్న తర్వాత, వైద్య బృందం నుండి అనుమతి పొందిన తర్వాత ఆమె తిరిగి వస్తుంది. బ్రిటన్ యువరాణి కేట్ మిడిల్టన్ (42) క్యాన్సర్ బారిన పడిన విషయాన్ని ఆమే స్వయంగా వెల్లడించారు. ఆమె చికిత్స కొనసాగించినప్పటికీ, మిడిల్‌టన్ రాయల్ ఫౌండేషన్ సెంటర్ ఫర్ ఎర్లీ చైల్డ్ హుడ్ కార్యకలాపాల గురించి సమాచారాన్ని అడుగుతూనే ఉన్నారు. అయితే, ఆమె తక్షణమే తిరిగి రావడానికి ఇది సంకేతంగా భావించకూడదని కెన్సింగ్టన్ ప్యాలెస్ అధికార ప్రతినిధి అప్పట్లో స్పష్టం చేశారు.