జిల్ బైడెన్ కరోనా పాజిటివ్.. జీ20 సదస్సుకు అమెరికా అధ్యక్షుడు వస్తారా?
మరో రెండు రోజుల్లో దిల్లీలో జరిగే జీ20 సదస్సు కోసం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత్‌కు బయలుదేరాల్సిన ఉండగా.. ఆయన పర్యటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జో బైడెన్ సతీమణి జిల్ బైడెన్‌కు కోవిడ్ పాజిటీవ్‌గా తేలడమే ఇందుకు కారణం. అయితే జో బైడెన్ కరోనా నెగిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్ పియర్ తెలిపారు. ఈ వారం రోజులు పాటు అమెరికా అధ్యక్షుడికి క్రమం తప్పకుండా పరీక్షలు నిర్వహించి, లక్షణాలను పరీక్షించనునట్లు జీన్ పియర్ వెల్లడించారు.
రెహోబోత్ బీచ్‌లోని తన ఇంటిలో విశ్రాంతి తీసుకుంటున్న జిల్ బైడెన్
ఆగస్టులో సౌత్ కరోలినాలో విహారయాత్ర చేస్తున్నప్పుడు జిల్ బైడెన్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఆ సమయంలో జో బైడెన్‌కు కూడా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అయితే ప్రస్తుతం జిల్ బైడెన్ డెలావేర్‌లోని రెహోబోత్ బీచ్‌లోని తన ఇంటిలో విశ్రాంతి తీసుకుంటున్నట్లు కమ్యూనికేషన్స్ డైరెక్టర్ ఎలిజబెత్ అలెగ్జాండర్ తెలిపారు. జిల్ బైడెన్‌కు పాజిటివ్ రావడం వల్ల ఆయన జీ20 సదస్సు పర్యటనపై ఏమైనా ప్రభావం పడుతుందా? అని అడిగినప్పుడు వైట్ హౌస్ ప్రతినిధులు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. దిల్లీలో జరిగే సదస్సులో పాల్గొనేందుకు బైడెన్ గురువారం బయలుదేరాల్సి ఉంది.