California: కాలిఫోర్నియాలో హిందూ దేవాలయంపై దాడికి పాల్పడిన ఖలిస్తానీలు
అమెరికా కాలిఫోర్నియాలోని ఒక హిందూ దేవాలయాన్నిఖలిస్థానీలు గ్రాఫిటీ పెయింట్స్‌తో ధ్వంసం చేశారు. కాలిఫోర్నియాలోని స్వామినారాయణ మందిరంపై ఇదివరకు ఇలాగే దాడికి చెయ్యగా తాజాగా మరోసారి హిందూ ఆలయాన్ని టార్గెట్ చేశారు. హిందూ అమెరికన్ ఫౌండేషన్ (HAF) శుక్రవారం సోషల్ మీడియా పోస్ట్‌లో కాలిఫోర్నియాలోని హేవార్డ్ లోని షెరావాలి ఆలయాన్ని ధ్వంసం చేసిన సమాచారాన్ని పంచుకుంది. హెచ్‌ఏఎఫ్ ఈ ఘటనకు సంబంధించిన ఫోటో కూడా షేర్ చేసింది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులతో టచ్‌లో ఉన్నట్లు తెలిపింది. ఖలిస్తానీ మద్దతుదారులు నుండి పెరుగుతున్న ముప్పు దృష్ట్యా భద్రతా కెమెరాలు, అలారం వ్యవస్థలను ఏర్పాటు చేయాలని HAF కోరింది.
ఆలయ గోడపై ద్వేషపూరిత నినాదాలు
గతేడాది డిసెంబర్ 23న కాలిఫోర్నియాలోని నెవార్క్ నగరంలో ఖలిస్థాన్ అనుకూల నినాదాలతో హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేశారు. ఈ చిత్రాలను హిందూ అమెరికన్ ఫౌండేషన్ X లో షేర్ చేసింది. స్వామినారాయణ మందిర్ వాసనా సంస్థ గోడలపై ఖలిస్తాన్ మద్దతు వ్యాఖ్యలను రాశారు. ఆలయ గోడపై భారత్‌కు, ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ద్వేషపూరిత నినాదాలు చిత్రీకరించారు. ఆ సమయంలో, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కూడా స్పందించారు. తీవ్రవాదులు, వేర్పాటువాదులకు చోటు ఇవ్వదని అమెరికాకు సూచించారు.