LOADING...
Iran: ఇరాన్‌లో నిరసనలు.. 217 మంది మృతి..?
ఇరాన్‌లో నిరసనలు.. 217 మంది మృతి..?

Iran: ఇరాన్‌లో నిరసనలు.. 217 మంది మృతి..?

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 10, 2026
10:56 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొనసాగుతున్న నిరసనలు తీవ్రరూపం దాల్చాయి. ఈ ఆందోళనల్లో ఇప్పటివరకు 217 మంది మృతి చెందారని టైమ్‌ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ వైద్యుడు వెల్లడించారు. మరణాల ఎక్కువ భాగం టెహ్రాన్‌లో చోటు చేసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఈ సంఖ్య మరింత ఎక్కువ కావచ్చని, మృతుల్లో ఎక్కువ మంది యువకులు ఉన్నట్లు కూడా వైద్యుడు తెలిపాడు. ఉత్తర టెహ్రాన్ పోలీస్ స్టేషన్ వెలుపల భద్రతా దళాలు నిరసనకారులపై మెషిన్‌గన్లతో కాల్పులు జరపడంతో 30 మంది ఆందోళనకారులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. అంతేకాకుండా దేశంలో ఉద్రిక్తతల కారణంగా ఇంటర్నెట్, ఫోన్ కనెక్షన్‌లు నిలిపివేయడం వల్ల నిరసనలు, మృతుల వివరాలు అంతర్జాతీయంగా పూర్తిగా తెలియడం లేదు.

Details

అమెరికా జోక్యం చేసుకోవాలి

స్థానిక వైద్యుల ప్రకారం, ఇరాన్‌లో మరణించిన వారు ఎక్కువగా యువతలో ఉంటారు. అయితే అంతర్జాతీయ మీడియా ఇప్పటివరకు ఇరాన్‌లో 65 మంది మాత్రమే ప్రాణాలు కోల్పోయినట్లు నివేదికలు వెల్లడించింది. ఈ ఉద్రిక్తతలపై స్పందిస్తూ ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా అలీఖమేనీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్ చేతులు ఇరాన్ ప్రజల రక్తంతో తడిచాయని, ఆయన సంతోషం కోసం సొంత వీధులను నాశనం చేసుకుంటూ ప్రజలపై ప్రభుత్వం దాడులు చేస్తున్నట్లు ఖమేనీ విమర్శించారు. ఈపరిస్థితిలో ఇరాన్‌లో నిరసనల్లో పాల్గొంటున్న ప్రజలను కాపాడాలని ప్రవాసంలో ఉన్న ఇరాన్ యువరాజు రెజా పహ్లావి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు విజ్ఞప్తి చేశారు. అమెరికా ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement