NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / LAC: రోడ్లు, విమానాశ్రయాలు, హెలీప్యాడ్లు.. ఎల్ఏసీ వద్ద చైనా భారీ ఎత్తున నిర్మాణాలు.. పెంటగాన్ సంచలన నివేదిక
    తదుపరి వార్తా కథనం
    LAC: రోడ్లు, విమానాశ్రయాలు, హెలీప్యాడ్లు.. ఎల్ఏసీ వద్ద చైనా భారీ ఎత్తున నిర్మాణాలు.. పెంటగాన్ సంచలన నివేదిక
    రోడ్లు, విమానాశ్రయాలు, హెలీప్యాడ్లు.. ఎల్ఏసీ వద్ద చైనా భారీ ఎత్తున నిర్మాణాలు.. పెంటగాన్ సంచలన నివేదిక

    LAC: రోడ్లు, విమానాశ్రయాలు, హెలీప్యాడ్లు.. ఎల్ఏసీ వద్ద చైనా భారీ ఎత్తున నిర్మాణాలు.. పెంటగాన్ సంచలన నివేదిక

    వ్రాసిన వారు Stalin
    Oct 22, 2023
    11:34 am

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత సరిహద్దు వాస్తవ నియంత్రణ రేఖ(LAC) వద్ద చైనా చేపడుతున్న నిర్మాణాలు, ఆ దేశ సైనిక శక్తిపై అమెరికా రక్షణ శాఖ పెంటగాన్‌ సంచలన నివేదికను వెల్లడించింది.

    ఎల్ఏసీ వద్ద భారీగా మౌలిక వసతులను నిర్మిస్తున్నట్లు పేర్కొంది. అందులో రోడ్లు, విమానాశ్రయాలు, హెలీప్యాడ్లు, భూగర్భ నీటి నిల్వ సౌకర్యాలు, ఎయిర్‌ఫీల్డ్‌లు, సైనిక స్థావరాలను చైనా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పింది.

    భారతదేశం నుంచి ముప్పును ఎదుర్కొనేందుకు చైనా బంకర్లు, సొరంగాలు, రోడ్ల విస్తరణ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా లద్ధాఖ్ సరిహద్దులో చైనా తన సైనిక పెంచుకుంటోంది.

    గాల్వాన్ వద్ద 2020లో భారత్-చైనా మధ్య ప్రతిష్టంభన మొదలైంది. ఆ తర్వాత నుంచి భారత్ సరిహద్దులో సైనికులను సరిహద్దుకు తరలించేందుకు మౌలిక వసతులను నిర్మిస్తోంది.

    చైనా

    అణ్వాయుధాలను 1000కి పెంచుకోవాలని చూస్తున్న చైనా

    గత ఏడాది కాలంలో చైనా అణ్వాయుధాల సంఖ్యను పెంచుకుందని పెంటగాన్ తన నివేదికలో పేర్కొంది. ఇప్పుడు దాని వద్ద 500 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి.

    2030 నాటికి చైనా 1000 అణ్వాయుధాలను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని పెంటగాన్ చెప్పింది.

    పెంగటాన్ నివేదిక ప్రకారం, 3,488 కి.మీ పొడవైన ఎల్ఏసీ వద్ద చైనీస్ వెస్ట్రన్ థియేటర్ కమాండ్‌ను ఈ ఏడాది చివరి నాటికి విస్తరించాలని చైనా భావిస్తోంది.

    గతేడాది, ఎల్ఏసీ పశ్చిమ సెక్టార్‌లోని లడఖ్ వైపు రిజర్వ్‌లో నాలుగు కంబైన్డ్-ఆర్మ్స్ బ్రిగేడ్‌(సీఏబీ)లను నిర్మించింది.

    సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల దగ్గర చైనా కూడా 3 సీఏబీలను మోహరించింది. అంతేకాకుండా, ఉత్తరాఖండ్, హిమాచల్ సమీపంలోనూ సీఏబీను ఏర్పాటు చేస్తోంది.

    చైనా

    డోక్లామ్ నీటి నిల్వ సౌకర్యాలు, పాంగోంగ్ సరస్సుపై వంతెన 

    డోక్లామ్ సమీపంలో చైనా భూగర్భ నిల్వ సౌకర్యాలను నిర్మించిందని పెంటగాన్ పేర్కొంది.

    అలాగే ఎల్ఏసీ మూడు సెక్టార్లలో కొత్త రోడ్లను చైనా నిర్మించింది. పాంగోంగ్ సరస్సుపై రెండో వంతెనను కూడా నిర్మించినట్లు నివేదిక వెల్లడించింది.

    భూటాన్‌తో వివాదాస్పద ప్రాంతాల్లో చైనా గ్రామాలను కూడా నిర్మించినట్లు పెంటగాన్ పేర్కొంది.

    ఇండో-పసిఫిక్ ప్రాంతంలో మరో దేశం ప్రవేశాన్ని అడ్డుకునేందుకు చైనా భారీగా సైనిక సామర్థ్యాన్ని పెంచుకుంటోందని నివేదిక వెల్లడించింది.

    భూమి, సముద్రం, వాయు మార్గాల్లోనే కాకుండా, అణు, అంతరిక్షం, ఎలక్ట్రానిక్, సైబర్‌స్పేస్‌లలో కూడా చైనా తన యుద్ధ సామర్థ్యాన్ని భారీగా పెంచుకుంటుందని నివేదికలో వివరించింది.

    చైనా

    ప్రపంచ స్థాయి నెంబర్ 1 మిలటరీ నిర్మాణంపై చైనా ఫోకస్ 

    పెంటగాన్ నివేదిక ప్రకారం, చైనాను 2049 నాటికి ప్రపంచ స్థాయి నెంబర్ 1 మిలిటరీగా చేయాలని అధ్యక్షుడు జిన్‌పింగ్ లక్ష్యంగా పెట్టుకున్నారు.

    చైనా ఇప్పటికే ప్రపంచంలోనే అతిపెద్ద నౌకాదళాన్ని కలిగి ఉంది. ఇందులో 370 యుద్ధనౌకలు జలాంతర్గాములు ఉన్నాయి.

    ఈ క్రమంలో బలమైన ఆర్మీ వ్యవస్థను నిర్మించేందుకు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.

    ఈ ప్రణాళికలో భాగంగానే భారత్ నుంచి భవిష్యత్ ముప్పును నివారించేందుకు లద్ధాఖ్ నుంచి అరుణాచల్‌ప్రదేశ్‌ వరకు ఎల్‌ఏసీ మీదుగా గ్రామాల ఏర్పాటు పేరుతో సైనిక స్థావరాలను నిర్మిస్తోంది.

    ఈ గ్రామాలు సైనిక స్థావరాలుగా ఉపయోగపడే విధంగా మౌలిక సదుపాయాలను చైనా నిర్మిస్తోంది.

    చైనా

    ఎల్ఏసీ పొడవునా 628 గ్రామాలను నిర్మిస్తున్న చైనా 

    ఎల్ఏసీ వద్ద చైనా వాచ్ టవర్లు, పెద్ద గోదాములు, కాంక్రీట్ నిర్మాణాలు చేపడుతోంది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఏజెన్సీలు వివరించాయి.

    ప్రభుత్వ వర్గాల ప్రకారం, చైనా 3,488కి.మీ పొడవైన ఎల్ఏసీ సమీపంలో 'జియోకాంగ్' పేరుతో 628గ్రామాలను నిర్మిస్తోంది. జియోకాంగ్ అంటే చైనీస్ భాషలో 'సంపన్నమైనది' అర్థం.

    ఈ 628 గ్రామాల్లో ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులో ఉన్నాయి. ఈ గ్రామాల్లో మానిటరింగ్ పోస్టులు, వాటర్ స్టోరేజీ, హెలిప్యాడ్‌లు వంటి సౌకర్యాలు కల్పించారు.

    వివాదాస్పద అక్సాయ్ చిన్ ప్రాంతంలో చైనా సొరంగాలను కూడా నిర్మిస్తున్నట్లు పెంటగాన్ నివేదిక వెల్లడించింది.

    దాదాపు 11 సొరంగాలను నిర్మించినట్లు మాక్సర్ ఉపగ్రహ చిత్రాల ద్వారా వెల్లడైంది. సైనికులు, ఆయుధాల భద్రత కోసం వీటిని నిర్మిస్తున్నట్లు సమచారం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చైనా
    భారతదేశం
    తాజా వార్తలు
    అమెరికా

    తాజా

    KL Rahul: ఐపీఎల్‌లో సెంచరీతో పాటు మరో అరుదైన రికార్డు సాధించిన కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్
    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్
    PBKS vs RR: వధేరా-శశాంక్ విధ్వంసం.. రాజస్థాన్‌ ముందు భారీ లక్ష్యం రాజస్థాన్ రాయల్స్

    చైనా

    Rahul Gandhi: చైనా చొరబాటుపై రాహుల్ విమర్శలు; రాజీవ్ గాంధీకి లద్దాఖ్‌లో నివాళులు రాహుల్ గాంధీ
    China Economy: తీవ్ర సంక్షోభంలో చైనా ఆర్థిక వ్యవస్థ.. 40ఏళ్ల ఫార్మూలా విఫలం వృద్ధి రేటు
    BRICS Summit: ప్రధాని మోదీ-జీ జిన్‌పింగ్ భేటీపైనే అందరి దృష్టి  బ్రిక్స్ సమ్మిట్
    BRICS: 'బ్రిక్స్' కూటమిలో మరో 40దేశాలు ఎందుకు చేరాలనుకుంటున్నాయి?  బ్రిక్స్ సమ్మిట్

    భారతదేశం

    భారత్‌తో దౌత్య సంబంధాలు మాకు చాలా కీలకం: కెనడా రక్షణ మంత్రి  కెనడా
    భారత రక్షణ సిబ్బంది లక్ష్యంగా పాకిస్థాన్ సైబర్ దాడులు.. అలర్ట్ చేసిన కేంద్రం  పాకిస్థాన్
    2024 ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి రేటు 6శాతం.. ఎస్&పీ అంచనా  వృద్ధి రేటు
    మూడు నెలల్లో 90వేల మంది భారతీయ స్టూడెంట్స్‌కు వీసాలు జారీ చేసిన అమెరికా  అమెరికా

    తాజా వార్తలు

    Supreme Court: 26 వారాల ప్రెగ్నెన్సీ అబార్షన్‌కు సుప్రీంకోర్టు నిరాకరణ సుప్రీంకోర్టు
    ICC Cricket World Cup: సౌతాఫ్రికా వర్సెస్ నెదర్లాండ్స్‌.. సఫారీల జోరు కొనసాగుతుందా?  ప్రపంచ కప్
    స్వదేశీ ఎల్‌సీఏ ఫైటర్ జెట్‌లలో 'అంగద్', 'ఉత్తమ్'ను అమర్చేందుకు రక్షణ శాఖ ప్లాన్  రక్షణ శాఖ మంత్రి
    ఇరాన్ ఆదేశంతోనే లెబనాన్ సరిహద్దులో హిజ్బుల్లా మిలిటెంట్ల దాడి: ఇజ్రాయెల్  ఇజ్రాయెల్

    అమెరికా

    సెప్టెంబర్ 28న జో బైడెన్‌ అభిశంసన కమిటీ విచారణ  జో బైడెన్
    కెనడా నిప్పుతో చెలగాటమాడటం ఆడుతోందని అమెరికా చురకలు.. వాషింగ్టన్‌ జోక్యం వద్దని నిపుణుల సూచన   కెనడా
    టీ20 ప్రపంచకప్‌ 2024లో ఐసీసీ కీలక నిర్ణయం.. అమెరికాలో మూడు వేదికలు ఖరారు టీ20 ప్రపంచకప్‌
    అమెరికాలో దారుణం: 6నెలల పసిబాలుడిని కొరికి తినేసిన ఎలుకలు  ప్రపంచం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025