Page Loader
టర్కీ లో ఆరేళ్ళ బాలికను రక్షించిన స్నిపర్ డాగ్స్ రోమియో,జూలీ
టర్కీ లో ఆరేళ్ళ బాలికను రక్షించిన స్నిపర్ డాగ్స్ రోమియో,జూలీ

టర్కీ లో ఆరేళ్ళ బాలికను రక్షించిన స్నిపర్ డాగ్స్ రోమియో,జూలీ

వ్రాసిన వారు Nishkala Sathivada
Feb 10, 2023
07:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

టర్కీలో వరుసగా సంభవించిన భూకంపాల తర్వాత మూడు రోజులపాటు శిథిలాల కింద కూరుకుపోయిన 6 ఏళ్ల బాలికను స్నిఫర్ డాగ్స్ రక్షించాయి. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ డాగ్ స్క్వాడ్‌లో భాగమైన రోమియో, జూలీ, శిథిలాల కింద 6 ఏళ్ల నస్రీన్ ఆచూకీని గుర్తించడంలో కీలక పాత్ర పోషించాయి. రోమియో, జూలీ హ్యాండ్లర్ కమాండర్ గుర్మీందర్ సింగ్‌ మాట్లాడుతూ జూలీ నస్రీన్‌ను మొదట పసిగట్టి మమ్మల్ని అప్రమత్తం చేసింది ఆ తర్వాత రోమియోను రప్పించి శిధిలాల క్రింద ఉన్న ఆమెను రక్షించామని చెప్పారు. నస్రీన్‌ను మిలిటరీ ఛాపర్ ద్వారా విమానంఎక్కించారు. చికిత్స కోసం టర్కీయేస్ హటేలోని ఇండియన్ ఆర్మీ ఫీల్డ్ హాస్పిటల్‌కు తరలించారు. ఆమె ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

జూలీ, రోమియో గురించి గౌరవ్ సావంత్ చేసిన ట్వీట్