Loading...
Black Sea: వాణిజ్య నౌకపై రష్యా డ్రోన్ దాడి.. భారతీయ నావికులు సురక్షితం.. ఇద్దరు మృతి
వాణిజ్య నౌకపై రష్యా డ్రోన్ దాడి.. భారతీయ నావికులు సురక్షితం.. ఇద్దరు మృతి

Black Sea: వాణిజ్య నౌకపై రష్యా డ్రోన్ దాడి.. భారతీయ నావికులు సురక్షితం.. ఇద్దరు మృతి

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 06, 2026
08:01 am

ఈ వార్తాకథనం ఏంటి

నల్ల సముద్రంలో మరోసారి రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం కనిపించింది. ఉక్రెయిన్ నుంచి ఇటలీకి మొక్కజొన్న సరుకును తరలిస్తున్న టర్కీకి చెందిన వాణిజ్య నౌకపై రష్యా డ్రోన్లు దాడి చేశాయి. ఈ ఘటనలో ఇద్దరు నావికులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో నౌక కెప్టెన్ కూడా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మరో మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. నౌకలో ఉన్న మరో 11 మందిని అధికారులు సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.

వివిరాలు 

సుమీ ఫార్మా ప్లాంట్‌పై దాడి తర్వాత..

ఇటీవల ఉక్రెయిన్‌లోని సుమీ నగరంలో భారత కంపెనీకి చెందిన కుసుమ్ గ్రూప్ ఫార్మా ప్లాంట్‌పై రష్యా డ్రోన్ల దాడి జరిగిన విషయం తెలిసిందే.

ఆ ఘటనలో ఒకరు మృతిచెందడంతో పాటు భారీగా ఆస్తి నష్టం జరిగింది.

ఈ ఘటన జరిగిన కొద్ది రోజులకే నల్ల సముద్రంలో టర్కీకి చెందిన సరకు రవాణా నౌకపై డ్రోన్ దాడి జరగడం ఆందోళనకు దారితీసింది.

ఈ నౌకలో అజర్‌బైజాన్, భారతదేశానికి చెందిన నావికులు ఉన్నారు.

వివరాలు 

మొక్కజొన్న సరుకుతో ప్రయాణం..

'రోయడ్ మమ్మాదోవ్' పేరుతో ఉన్న ఈ నౌక ఉక్రెయిన్ నుంచి మొక్కజొన్న సరుకును ఇటలీకి తీసుకెళ్తున్న సమయంలో దాడికి గురైనట్లు మెరైన్ ట్రాఫిక్ అధికారులు తెలిపారు.

షిప్పింగ్ వెబ్‌సైట్ మెరైన్ ట్రాఫిక్‌లోని వివరాల ప్రకారం.. నౌక ఉక్రెయిన్‌లోని ఇజ్‌మెయిల్ పోర్టు నుంచి బయలుదేరి ఇటలీలోని సెయింట్ కిట్టిస్, నెవిస్ ప్రాంతాల వైపు వెళ్తున్నట్లు తెలుస్తోంది.

జెలెన్‌స్కీ ఏమన్నారంటే..

ఈ ఘటనపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ 'ఎక్స్' వేదికగా స్పందించారు.

నల్ల సముద్రంలో వాణిజ్య నౌకపై రష్యా డ్రోన్ దాడి జరగడంతో మంటలు చెలరేగాయని, అనంతరం నౌక నీటిలో మునిగిపోయిందని తెలిపారు.

ఈ దాడిలో ఇద్దరు మృతిచెందగా.. మరో 11 మంది ప్రాణాలతో బయటపడ్డారని పేర్కొన్నారు.

ADVERTISEMENT

వివరాలు 

దాడిని ధ్రువీకరించిన రొమేనియా..

ప్రజా అవసరాలకు ఉపయోగపడే వాణిజ్య నౌకపై రెండు రష్యన్ డ్రోన్లతో దాడి చేయడం తీవ్రమైన ఘటనగా ఆయన అభివర్ణించారు.

దాడికి గురైన నౌక టర్కీకి చెందినదని, మొక్కజొన్న సరుకును రవాణా చేస్తోందని వెల్లడించారు.

నల్ల సముద్రంలో ఇటువంటి ఘటనలు జరగకుండా ఉక్రెయిన్ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ రష్యా దాడులు కొనసాగిస్తోందని జెలెన్‌స్కీ ఆరోపించారు.

ప్రపంచవ్యాప్తంగా ఆహార భద్రతను కాపాడేందుకు రష్యాపై అంతర్జాతీయంగా ఒత్తిడి పెంచాలని ఆయన కోరారు.

టర్కీ నౌకపై రష్యా డ్రోన్ల దాడి జరిగినట్లు రొమేనియాకు చెందిన నేవల్ అథారిటీ కూడా వెల్లడించింది.

'రోయడ్ మమ్మదోవ్' నౌకను రష్యా డ్రోన్లు లక్ష్యంగా చేసుకున్నట్లు పేర్కొంది. దాడి అనంతరం నౌకలోని 11 మందిని సురక్షితంగా రక్షించినట్లు అధికారులు తెలిపారు.

ADVERTISEMENT

వివరాలు 

రష్యా నుంచి స్పందన లేదు..

గాయపడిన వారిని హెలికాప్టర్ల ద్వారా తరలించి ఆస్పత్రులకు చేర్చినట్లు సమాచారం.

ఈ దాడిపై ఇప్పటివరకు రష్యా అధికారికంగా ఎలాంటి స్పందన చేయలేదు. ఘటనకు సంబంధించి రష్యా వైపు నుంచి వివరణ రావాల్సి ఉంది.

నల్ల సముద్రంపై పెరుగుతున్న ఆందోళనలు..

ప్రపంచ వాణిజ్య రవాణాలో నల్ల సముద్రానికి కీలకమైన స్థానం ఉంది. అనేక దేశాలకు సరకు రవాణాకు ఈ సముద్ర మార్గం ముఖ్యమైనది.

అయితే 2022లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఈ ప్రాంతంలో భద్రతాపరమైన ఆందోళనలు గణనీయంగా పెరిగాయి.

వాణిజ్య నౌకల రాకపోకలపైనా యుద్ధ ప్రభావం పడుతోంది. తాజాగా టర్కీకి చెందిన సరకు నౌకపై జరిగిన డ్రోన్ దాడి ఈ ఆందోళనలను మరింత పెంచింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

జెలెన్‌స్కీ 'ఎక్స్' వేదికగా చేసిన ట్వీట్ 

ADVERTISEMENT