Russia: ఉగ్ర సంస్థలుగా ప్రకటించిన వాటిని రద్దు చేసే హక్కు.. రష్య కొత్త చట్టం
రష్యా పలు సంస్థలపై ఉగ్రవాద ముద్రను తొలగించే దిశగా చర్యలు చేపడుతోంది. ఈ ప్రక్రియలో భాగంగా మాస్కో కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టింది, దీని ప్రకారం ఉగ్ర సంస్థల ముద్రను రద్దు చేసే అధికారం కోర్టులకు అప్పగించారు. ఈ చట్టాన్ని పార్లమెంటు దిగువ సభ స్టేట్ డూమా ఆమోదించింది. ఈ అంశంపై పలు అంతర్జాతీయ మీడియా కథనాలు ప్రచురించాయి. కొత్త చట్టం ప్రకారం, ఒక సంస్థ ఉగ్రవాద కార్యకలాపాలకు దూరంగా ఉందని కోర్టు గుర్తిస్తే, ఆ సంస్థలను ఉగ్ర జాబితా నుంచి తొలగించే అవకాశం ఉంది. దీనివల్ల ఆఫ్ఘాన్ తాలిబన్లు, సిరియా తిరుగుబాటుదారులతో సంబంధాలను మెరుగుపరచేందుకు మాస్కోకు మార్గం సుగమమవుతుంది.
సిరియాలో కొత్త ప్రభుత్వంతో క్రెమ్లిన్ చర్చలు
రష్యా మొదటగా 2003లో ఆఫ్ఘాన్ తాలిబన్లను ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. ఆ తర్వాత సిరియా తిరుగుబాటుదారులను కూడా జాబితాలో చేర్చింది. సిరియాలో రెబల్స్ తిరుగుబాటుతో బషర్ అల్-అసద్ ప్రభుత్వం ఇబ్బందుల్లో పడిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాల వల్ల మాస్కో సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న సైనిక స్థావరాలకు ముప్పు ఏర్పడే అవకాశం ఉంది. హయత్ తహ్రీర్ అల్ షామ్ (HTS) వంటి సంస్థలను ఉగ్రవాద ముద్ర నుంచి తొలగించాలని కొందరు మాస్కోలో డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మాస్కో, సిరియాలోని కొత్త ప్రభుత్వంతో సంబంధాలను బలపరచేందుకు సిద్ధమవుతోంది. క్రెమ్లిన్ సిరియాలో కొత్త ప్రభుత్వంతో ఈ వారంలో చర్చలు జరుపుతోందని అధికార వర్గాలు తెలియజేశాయి.