Page Loader
Russia: ఉక్రెయిన్‌ పవర్‌గ్రిడ్‌పై రష్యా క్షిపణి దాడులు
ఉక్రెయిన్‌ పవర్‌గ్రిడ్‌పై రష్యా క్షిపణి దాడులు

Russia: ఉక్రెయిన్‌ పవర్‌గ్రిడ్‌పై రష్యా క్షిపణి దాడులు

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 17, 2024
03:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

రష్యా ఆదివారం ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ సహా పలు కీలక ప్రాంతాల్లో భారీగా దాడులు చేపట్టింది. శీతాకాలం ప్రారంభమైన నేపథ్యంలో పవర్‌ గ్రిడ్‌ను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు ప్రయోగించినట్లు సమాచారం. ఆగస్టు నుంచి ఇప్పటి వరకు ఈ దాడి అతిపెద్దది అని ఉక్రెయిన్‌ ఎనర్జీ మంత్రి గెర్మన్‌ ధ్రువీకరించారు. ఈ దాడుల వల్ల విద్యుత్తు సరఫరా, ఉత్పత్తి వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కీవ్‌ సహా అనేక నగరాల్లో విద్యుత్తు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇక రాజధాని కీవ్‌లో భారీ పేలుళ్లు వినిపించాయి. వాటి ప్రభావంతో, సిటీ సెంటర్‌ భాగాన్ని లక్ష్యంగా చేసుకుని తీవ్ర నష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు.

Details

ప్రాణ, ఆస్తి నష్టాలపై సమాచారం లేదు

ప్రాణ, ఆస్తి నష్టాల వివరాలపై ఇంకా అధికారికంగా సమాచారం అందలేదు. ఉక్రెయిన్‌ అధికారులు ఈ దాడిని 'రష్యా డ్రోన్లు, క్షిపణులతో రూపొందించిన ఒక పెద్ద దాడి' అని పేర్కొన్నారు. ఈ దాడి అనంతరం, సరిహద్దులలలో ఉన్న పోలాండ్‌ అప్రమత్తమైంది. పరిస్థితులు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో అని వాయుసేన సిద్ధంగా ఉంది. శీతాకాలంలో ఉక్రెయిన్‌ పవర్‌ గ్రిడ్‌ను ధ్వంసం చేయాలని రష్యా ప్రయత్నించడం సవాల్‌గా మారింది. ఇలాంటి దాడులు భారీ పరిణామాలకు దారితీస్తే, వేల మంది ప్రాణాలను కోల్పోయే అవకాశం ఉంది.