Page Loader
Sleeping Prince: కోమాలో 20 ఏళ్లు.. సౌదీ యువరాజు అల్వలీద్ బిన్ ఖలీద్ కన్నుమూత!
కోమాలో 20 ఏళ్లు.. సౌదీ యువరాజు అల్వలీద్ బిన్ ఖలీద్ కన్నుమూత!

Sleeping Prince: కోమాలో 20 ఏళ్లు.. సౌదీ యువరాజు అల్వలీద్ బిన్ ఖలీద్ కన్నుమూత!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 20, 2025
11:06 am

ఈ వార్తాకథనం ఏంటి

2005లో లండన్‌లో జరిగిన ఘోర కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, అప్పటినుంచి కోమాలో ఉన్న సౌదీ యువరాజు అల్వలీద్ బిన్ ఖలీద్ బిన్ తలాల్ అల్ సౌద్ కన్నుమూశారు. ఆయన వయసు 36 సంవత్సరాలు. ఈ ఘటనపై గ్లోబల్ ఇమామ్స్ కౌన్సిల్ హృదయపూర్వక సంతాపాన్ని ప్రకటించింది. 'సుదీర్ఘకాలం పాటు మృత్యువుతో పోరాడిన సౌదీ యువరాజు మరణించారని తీవ్ర విచారంతో తెలియజేస్తున్నామని ఒక ప్రకటనలో వెల్లడించింది. ప్రిన్స్ మరణాన్ని ఆయన తండ్రి ఖలీద్ బిన్ తలాల్ అల్ సౌద్ కూడా సోషల్ మీడియా వేదికగా ధృవీకరించారు. అల్వలీద్‌ బిన్ ఖలీద్‌ 2005లో యూకేలోని ఓ సైనిక కళాశాలలో విద్యార్ధిగా ఉన్న సమయంలోనే కారు ప్రమాదానికి గురయ్యారు. అప్పట్లో ఆయన వయసు 15 ఏళ్లు మాత్రమే.

Details

శాశ్వతంగా వైద్యుల పర్యవేక్షణలో లైఫ్ సపోర్టు

ప్రమాదంలో తలకు తీవ్రగాయాలవడంతో శరీరంలో అంతర్గత రక్తస్రావం జరిగింది. అనంతరం ఆయన పూర్తి కోమాలోకి వెళ్లిపోయారు. వెంటనే రియాద్‌లోని కింగ్ అబ్దులాజీజ్ మెడికల్ సిటీలో అతన్ని చేర్పించి, అప్పటి నుంచి శాశ్వతంగా వైద్యుల పర్యవేక్షణలో లైఫ్ సపోర్ట్ సిస్టమ్‌పై చికిత్స అందించారు. ఈ గడిచిన రెండు దశాబ్దాల్లో 'స్లీపింగ్ ప్రిన్స్'గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన అల్వలీద్.. కొంతకాలానికి స్వల్పంగా కదలికలు చూపించడంతో ఆశలెత్తినప్పటికీ, స్పష్టమైన స్పృహకు రాలేకపోయారు. అమెరికన్, స్పానిష్ నిపుణులచే చికిత్స చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. 2015లో వైద్యులు అతని జీవితానికి మద్దతుగా ఉన్న వెంటిలేటర్ తొలగించాలని సిఫార్సు చేశారు. కానీ, అతని తండ్రి ఖలీద్ బిన్ తలాల్‌ దేవుడిపై నమ్మకంతో ఆ ప్రతిపాదనను తిరస్కరించారు.

Details

చివరి పోరాడిన ఫలితం లేకుండా పోయింది

'జీవితాన్ని ఆపేయడం మన చేతిలో లేదు.. ఆ నిర్ణయం దేవునిదేనని ఆయన స్పష్టం చేశారు. ప్రిన్స్ అల్వలీద్ 1990 ఏప్రిల్‌లో జన్మించారు. ఆయన బిలియనీర్ వ్యాపారవేత్త అల్వలీద్ బిన్ తలాల్‌కు మేనల్లుడు. తన కుమారుడి ప్రాణాలను కాపాడేందుకు చివరి వరకు పోరాడిన ఖలీద్ బిన్ తలాల్‌ తండ్రిగా చూపిన ప్రేమకు ప్రపంచం సాక్షిగా నిలిచింది.