Saudi Arabia Work Visa: సౌదీ వర్క్ వీసా నిబంధనలు మరింత కఠినతరం.. ముందస్తు వెరిఫికేషన్ తప్పనిసరి
ఈ వార్తాకథనం ఏంటి
సౌదీ అరేబియాలో ఉద్యోగం కోసం వెళ్లాలనుకునే భారతీయులకు నూతన నిబంధనల ప్రకారం మరో సమస్య ఎదురైంది.
ఇకపై సౌదీ వర్క్ వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారు తమ వృత్తిపరమైన, విద్యా అర్హతలకు సంబంధించి ముందస్తు వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది.
ఈ కొత్త నిబంధనలను ఇవాళ్టి నుంచి అమలు చేశారు. సౌదీ అరేబియాలోని భారత ఎంబసీ తన సర్క్యులర్‌లో ఈ మార్పును ప్రకటించింది. 'వర్క్ వీసాల జారీకి ప్రొఫెషనల్ వెరిఫికేషన్ తప్పనిసరిగా ఉంటుందని పేర్కొంది.
ఈ వెరిఫికేషన్‌ను ఆరు నెలల కిందటే ప్రతిపాదించారు. ఇది నాణ్యతా ప్రమాణాలను పాటించడాన్ని, అలాగే భారత్ నుండి వచ్చే కార్మికుల సంఖ్యపై నియంత్రణను కలిగి ఉండనుంది.
Details
సౌదీలో 24 లక్షల మంది భారతీయులు
కొత్త నిబంధనల ప్రకారం, వర్క్ వీసా కోసం దరఖాస్తు చేసే ప్రతి అభ్యర్థి తమ విద్యార్హతలను ధ్రువీకరించుకోవాల్సి ఉంటుంది.
ప్రవాస ఉద్యోగుల సర్టిఫికెట్లు, ప్రొఫెషనల్ సమాచారం సంబంధిత సంస్థలు, హెచ్‌ఆర్ విభాగాలు వెరిఫై చేయాలి. భారత ఎంబసీ ప్రకారం, సౌదీ అరేబియాలో రెండో అత్యధిక భారతీయ కార్మికులు ఉన్నారు.
2024 నాటికి సుమారు 24 లక్షల మంది భారతీయులు సౌదీలో పనిచేస్తున్నారు. వారిలో 16.4 లక్షల మంది ప్రైవేట్ రంగ సంస్థలలో, 7.8 లక్షల మంది ఇళ్లల్లో వివిధ పనులు చేస్తున్నారు.
సౌదీలో ప్రవాస కార్మికుల సంఖ్యలో బంగ్లాదేశ్ 26.9 లక్షలతో మొదటి స్థానంలో ఉంది.