
France: ఫ్రాన్స్ నూతన ప్రధానిగా సెబాస్టియన్ లెకోర్ను నియామకం
ఈ వార్తాకథనం ఏంటి
ఫ్రాన్స్ నూతన ప్రధానిగా సెబాస్టియన్ లెకోర్ను నియమితులయ్యారు. ఇప్పటివరకు రక్షణ మంత్రిగా పనిచేస్తున్న సెబాస్టియన్‌ను ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ప్రధానమంత్రిగా నియమించారు. ప్రస్తుత ప్రధానమంత్రి ఫ్రాంకోయిస్ బేరో తన పదవికి రాజీనామా చేయగానే సెబాస్టియన్‌ను కొత్త ప్రధానిగా ఎంపిక చేశారు. జాతీయ అసెంబ్లీలో జరిగిన విశ్వాస ఓటులో ఫ్రాంకోయిస్ బేరో ఓటమిపాలయ్యారు. దీంతో ఆయన ప్రధాని రాజీనామా చేయాల్సి వచ్చింది. ఫ్రెంచ్‌లో రాజకీయ సంక్షోభం తలెత్తింది. ఇలాంటి తరుణంలో సెబాస్టియన్ లెకోర్ను నూతన ప్రధానమంత్రిగా ఎంపికయ్యారు. ఇప్పుడు ఈయనపై చాలా బాధ్యతలు ఉన్నాయి.
వివరాలు
కొత్త ప్రధాని ముందు అనేక సవాళ్లు
విభజిత పార్లమెంట్‌ను సమన్వయ పరచడం, దేశ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో 2026 బడ్జెట్‌ను సెబాస్టియన్ లెకోర్ను ఆమోదించాల్సి అవసరం ఉంది. కొత్త ప్రధాని ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. ధైర్యంగా ముందుకు నడిపిస్తే బాగానే ఉంటుంది. లేదంటే ఇప్పటికే రెండేళ్లకే ఇద్దరు ప్రధానులు మారారు. సరిగ్గా చేయకపోతే లెకోర్నుకు కూడా ఇబ్బందులు తప్పవు.
వివరాలు
సెబాస్టియన్ లెకోర్ను ఎవరు?
ఫ్రెంచ్ చరిత్రలో అత్యల్ప వయసులోనే ముఖ్యమైన పదవులు చేపట్టిన నేతగా సెబాస్టియన్ లెకోర్ను పేరు ప్రత్యేకంగా నిలుస్తోంది. కేవలం 39 సంవత్సరాలు వయసులోనే ఫ్రాన్స్ రక్షణ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ప్రస్తుత ప్రభుత్వంలో మూడో ప్రధానమంత్రిగా ఉండటం విశేషం. గతంలో జాతీయ సంక్షోభ సమయాల్లో కీలక నిర్ణయాలు తీసుకొని, సవాళ్లను ఎదుర్కొన్న అనుభవం ఆయనకు ఉంది. ఈ నేపథ్యం ఆధారంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ ప్రధానమంత్రి పదవికి లెకోర్నును ఎంపిక చేశారు.
వివరాలు
సెబాస్టియన్ లెకోర్ను ఎవరు?
ప్రస్తుతం ఫ్రాన్స్ ఆర్థిక కష్టాల్లో పడిపోతున్న సందర్భంలో ఈ సమస్యలను పరిష్కరించడం లెకోర్ను ముందున్న ప్రధాన పనిగా మారింది. అంతేకాదు, అంతర్జాతీయ పొత్తుల విషయంలో కూడా ఫ్రాన్స్‌కు ఎదురవుతున్న ఇబ్బందులను సమర్థవంతంగా ఎదుర్కోవాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. ఈ కష్టాలను అన్ని అధిగమించి దేశాన్ని సమతుల్యంగా ముందుకు నడిపించడమే లెకోర్ను ప్రధాన లక్ష్యం.