Epstein files: రష్యన్ మహిళలతో లైంగిక సంబంధాలు.. బిల్‌గేట్స్‌పై ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో సంచలన ఆరోపణలు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించిన ఎప్‌స్టీన్ సెక్స్ కుంభకోణం సంబంధిత దర్యాప్తు ఫైల్స్‌లో(Epstein files) 30 లక్షల పేజీల సమాచారాన్ని అమెరికా న్యాయశాఖ విడుదల చేసింది. ఈ డాక్యుమెంట్లలో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌కు సంబంధించిన కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎప్‌స్టీన్ ఆరోపణల ప్రకారం గేట్స్ రష్యన్ మహిళలతో లైంగిక సంబంధాలు నెరిపాడని, అందువల్ల సుఖవ్యాధుల బారిన పడ్డారని పేర్కొన్నాడు. వివరాల ప్రకారం 2013లో ఎప్‌స్టీన్ తనకే రాసిన ఈ-మెయిల్‌లో ఈఅంశాలను ప్రస్తావించాడు. గేట్స్ రష్యన్ మహిళలతో లైంగిక సంబంధాలు ఏర్పరచకపోవడం వల్లనే సుఖవ్యాధుల బారిన పడ్డారని చెప్పాడు. ఈ విషయాన్ని బయటకు రాకుండా చేయడానికి గేట్స్ తన భార్య మిలిండాకు రహస్యంగా యాంటీబయోటిక్స్ ఇవ్వమని అడిగారని కూడా ఎప్‌స్టీన్ వివరించాడు.
Details
ఈ ఆరోపణలను ఖండించిన గేట్స్ ప్రతినిధులు
అదే మెయిల్‌లో, తర్వాతి ఆరేళ్లలో తనతో ఉన్న స్నేహాన్ని గేట్స్ ముగించాడని కూడా తెలిపారు. అయితే గేట్స్ ప్రతినిధులు ఈ ఆరోపణలను పూర్తిగా ఖండించారు. సంబంధాలు కొనసాగించకపోవడం వల్లే ఎప్‌స్టీన్ ఆయనపై అసంబద్ధమైన ఆరోపణలు చేశాడని తెలిపారు. ఇప్పటి విడుదలైన ఫైల్స్‌లో ఎప్‌స్టీన్, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మధ్య సంభాషణల వివరాలు కూడా బయటపడ్డాయి. ఎప్‌స్టీన్ యూఎస్ వర్జిన్ ద్వీపంలోని తన ద్వీపం సందర్శించమని మస్క్‌కి పలు ఈ-మెయిల్స్ ద్వారా ఆహ్వానాలు పంపాడు, కానీ మస్క్ ఆ ఆహ్వానాలను పలుమార్లు తిరస్కరించాడని తెలుస్తోంది.
Details
మరోసారి ప్రస్తావనలోకి ప్రిన్స్ ఆండ్రూ పేరు
అలాగే తాజా ఫైల్స్‌లో బ్రిటన్ రాజు చార్లెస్-3 సోదరుడు ప్రిన్స్ ఆండ్రూ పేరు మరోసారి ప్రస్తావనలోకి వచ్చింది. 2010లో ఆండ్రూ ఎప్‌స్టీన్‌ను బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో డిన్నర్‌కు ఆహ్వానించినట్లు ఈ-మెయిల్స్ ఆధారంగా తెలిసింది. అయితే, ఎప్‌స్టీన్ ఆ ప్యాలెస్‌కు వెళ్లాడా లేదా అనే విషయంపై స్పష్టత లేదు.