Jeffrey Epstein: అమెరికాలో సెక్స్ కుంభకోణం.. బిల్ క్లింటన్, స్టీఫెన్ హాకింగ్ సహా ప్రముఖుల పేర్లు
అమెరికాలో ప్రకంపనలు సృష్టించిన హైప్రొఫైల్ సెక్స్ కుంభకోణం (Sex scandal) మరోసారి వార్తాల్లో నిలిచింది. ప్రముఖ ఫైనాన్షియర్ జెఫ్రీ ఎప్‌స్టీన్ దుర్మర్గాల జాబితాను న్యూయార్క్ కోర్టు తాజాగా బట్టబయలు చేసింది. ఈ కేసుకు సంబంధించిన రహస్య పత్రాలను విడుదల చేసే ప్రక్రియలో భాగంగా తొలి విడతగా 40 పత్రాలను విడుదల చేశారు. ఈ కుంభకోణంలో అమెరికా మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్ (Bill Clinton), డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సహా మైకెల్ జాక్సన్, పలువురు ప్రముఖులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకుల పేర్లు బయటికొచ్చాయి. బిల్ క్లింటన్‌తో ఎప్‌స్టీన్ సాన్నిహిత్యం, బ్రిటన్ రాజకుటుంబానికి చెందిన ప్రిన్స్ ఆండ్రూపై వచ్చిన ఆరోపణల వంటి వివరాలు ఇందులో ఉన్నాయి.
సోబెర్గ్ వాంగ్మూలంలో ప్రిన్స్ అండ్రూపై సంచలన ఆరోపణలు
సోబెర్గ్ ఇచ్చిన మరో వాంగ్మూలంలో ఆమె ప్రిన్స్ ఆండ్రూపై సంచలన ఆరోపణలు చేశారు. 2001లో తాను న్యూయార్క్ వెళ్లినప్పుడు ఎప్‌స్టీన్ నివాసంలో ప్రిన్స్ తనని అసభ్యంగా తాకినట్లు పేర్కొన్నారు. సెక్స్ కుంభకోణాన్ని అగ్రరాజ్యాన్ని కుదిపేసిన విషయం తెలిసిందే. ఎప్‌స్టీన్ పేద, మధ్య తరగతి బాలికలు, యువతులకు భారీ మొత్తం ఆశగా చూపించి పామ్ బీచ్ బంగ్లాకు పిలిపించి అఘాయిత్యాలకు పాల్పడేవాడు. ఓ యువతి మరో యువతిని బంగ్లాకు తీసుకొస్తే ఇంకొంత కమిషన్ ఇస్తానని ఆవచూపేవాడు. రెండు దశాబ్దాల పాటు సాగిన ఈ చీకటి వ్యవహారం 2005లో బట్టబయలైంది. అప్పుడు అతన్ని అరెస్టు చేసి జైళ్లో ఉంచగా, అదే ఏడాది ఆగస్టులో అతను జైల్లో అనుమానాస్పద స్థితిలో మరణించాడు.