SFJ: ఎయిర్ ఇండియాకు పెను ముప్పు.. నవంబర్ 19న విమానంలో ప్రయాణించవద్దన్న పన్నూన్
కెనడాలోని ఖలినీస్థాన్ మద్ధతుదారుడు, సిక్ ఫర్ జస్టిస్ నాయకుడు మరో కుట్రకు తెరలేపాడు.ఈ మేరకు ఎయిర్ ఇండియాకు ముప్పు తలపెట్టేందుకు యత్నిస్తున్నట్లు, కనిష్క బాంబింగ్ మాదిరిగా మరోకటి ప్లాన్ చేస్తున్నట్లు నిఘా వర్గాలు అంటున్నాయి. ఆయా ఘటనలను పునరావృతం చేయడానికి గురుపత్వంత్ సింగ్ పన్నూన్ యువతను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే పన్నూన్, ఇందిరా గాంధీ హంతకులను కీర్తించారు. ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి మాజీ ప్రధాని ఇందిరా హంతకులు బియాంత్ సింగ్, సత్వంత్ సింగ్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. నవంబర్ 19, ఆ తర్వాత ఎయిరిండియా విమానంలో ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు ఉండవచ్చని గురుపత్వంత్ సింగ్ పన్నూన్ హెచ్చరించడం తేలికగా తీసుకోలేమని భారతీయ ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి.
భారత యువతను పన్నూన్ రెచ్చగొడుతున్నాడు : భారత నిఘా వర్గాలు
భారత్‌కు వ్యతిరేకంగా యువతను రెచ్చగొట్టేందుకు పన్నూన్ ప్రయత్నిస్తున్నాడని, 1985లో ఎయిర్ ఇండియా కనిష్క విమానంపై జరిగిన బాంబు దాడిని పునరావృతం చేస్తానని బెదిరిస్తున్నాడని నిఘా వర్గాలు నొక్కిచెప్పాయి. ఎయిరిండియా విమానాలు నడుపుతున్న ప్రధాన నగరాల్లో అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని నిఘా వర్గాలు సూచించాయి. ప్రపంచ దేశాలను పన్నూన్ స్వేచ్ఛగా తిరుగుతున్నాడని, అతనిపై ఏ దేశం చర్యలు తీసుకోకపోవడం ఆందోళన కలిగించే విషయమని పేర్కొన్నాయి. జూన్ 23, 1985న టొరంటో నుంచి కనిష్క చక్రవర్తి పేరుతో ఉన్న ఎయిరిండియా బోయింగ్ 747 విమానం మాంట్రియల్‌లోని మిరాబెల్ విమానాశ్రయం,లండన్‌లోని హీత్రో, దిల్లీలోని పాలెం, ముంబై సహర్‌లలో ఆగాల్సి ఉంది. అయితే ఇది గాల్లోనే పేలడంతో 329 మంది ప్రయాణికులతో సహా 22 మంది సిబ్బంగి మరణించారు.
ఆ రోజుే ఎయిరిండిలో ప్రయాణం వద్దు : పన్నూన్
ఇదే సందర్భాన్ని గుర్తు చేస్తూ నవంబర్ 19న ఎయిర్ ఇండియాలో ప్రయాణించవద్దని పన్నూన్ సిక్కులను కోరాడు. నవంబర్ 19న ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం మూసేయాలని భారత ప్రభుత్వాన్ని హెచ్చరించాడు. మరోవైపు అదే రోజు ప్రపంచ కప్ 2023 ఫైనల్ మ్యాచ్ జరగనుంది. బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్, కాంగ్రెస్ నేతలు కమల్ నాథ్, జగదీష్ టైట్లర్‌లను కూడా పన్నూన్ బెదిరించారు. భారత్‌ను రోజురోజుకు బెదిరిస్తున్న ఈ గ్లోబల్ టెర్రరిస్ట్‌కు మద్దతు ఇస్తున్న పలు దేశాలకు చెందిన రుజువులు తమ వద్ద ఉన్నాయిని భారత నిఘా వర్గాలు తెలిపాయి. పాకిస్తాన్‌తో ఇతని సంబంధం, ఇమ్మిగ్రేషన్ రాకెట్ గురించి ప్రపంచానికి తెలుసని, ఇకనైనా జస్టిన్ ట్రూడో ఈ ఉగ్రవాదిపై కఠిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నామన్నాయి.