Typhoon Bebinca: 75 ఏళ్లలో ఎన్నడూ లేనంత బలమైన తుపాను.. చైనాను వణికిస్తున్న 'బెబింకా'
ఈ వార్తాకథనం ఏంటి
చైనాను ప్రస్తుతం బెబింకా తుపాను వణికిస్తోంది. సోమవారం ఉదయం డ్రాగన్ ఆర్థిక కేంద్రం అయిన షాంఘైపై ఈ తుపాను విరుచుకుపడింది.
వాతావరణ శాఖ ప్రకారం, గత ఏడు దశాబ్దాల్లో షాంఘైను తాకిన తీవ్రమైన తుపాను ఇదేనని వెల్లడించారు, దీనివల్ల నగరంలోని ప్రజల జీవనం అంతా అస్తవ్యస్తమైంది.
ఈ రోజు తుపాను గంటకు 151 కి.మీ వేగంతో షాంఘైను తాకిందని స్థానిక మీడియా పేర్కొంది.
సాధారణంగా, ఈ నగరాన్ని తుపాన్లు నేరుగా తాకడం చాలా అరుదు. 1949లో వచ్చిన టైఫూన్ గ్లోరియా తర్వాత షాంఘైను మరోసారి తాకిన భారీ తుపాను ఇదే.
ఈ నేపథ్యంలో, ఆదివారం రాత్రి నుంచి రెండు విమానాశ్రయాల నుంచి రాకపోకలు సాగాల్సిన వందలకొద్దీ విమానాలు రద్దయ్యాయి.
వివరాలు
భారీ వర్షాల కారణంగా విద్యుత్తు సరఫరాలో అంతరాయం
పలు రైళ్లు కూడా నిలిపివేశారని అధికారులు తెలిపారు. నగరంలోని పలు పార్కులు, వినోద ప్రదేశాలను తాత్కాలికంగా మూసివేశారు.
ఇంతకుముందు, హైనాన్ ప్రావిన్స్‌ను యాగి తుఫాన్ ఇబ్బందులకు గురి చేసింది. బలమైన ఈదురుగాలులు, భారీ వర్షాల కారణంగా విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడింది.
సెల్‌ఫోన్ ఛార్జింగ్ లేకపోవడంతో ప్రజలు డిజిటల్ చెల్లింపుల కోసం ఇబ్బంది పడ్డారు.
చాలా మంది కనీసం నిత్యావసర వస్తువులను కొనుగోలు చేయలేకపోయారనే వార్తలు పలు మీడియా వర్గాలు వెల్లడించాయి.