NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Sheikh Hasina:షేక్ హసీనాకు మరో ఎదురుదెబ్బ.. ఆస్తుల సీజ్‌కు న్యాయస్థానం ఆదేశం 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Sheikh Hasina:షేక్ హసీనాకు మరో ఎదురుదెబ్బ.. ఆస్తుల సీజ్‌కు న్యాయస్థానం ఆదేశం 
    షేక్ హసీనాకు మరో ఎదురుదెబ్బ.. ఆస్తుల సీజ్‌కు న్యాయస్థానం ఆదేశం

    Sheikh Hasina:షేక్ హసీనాకు మరో ఎదురుదెబ్బ.. ఆస్తుల సీజ్‌కు న్యాయస్థానం ఆదేశం 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 12, 2025
    09:18 am

    ఈ వార్తాకథనం ఏంటి

    బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది.

    బంగ్లాదేశ్‌లో ఆమెకున్న ఆస్తులతో పాటు,కుటుంబ సభ్యుల ఆస్తులను సీజ్ చేయాలని న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది.

    బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్‌లకు వ్యతిరేకంగా ముదిరిన నిరసనల కారణంగా, గతేడాది ఆగస్టు 5న షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

    రాజీనామా అనంతరం, ప్రస్తుతం ఆమె భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు.

    వివరాలు 

    ఆస్తుల సీజ్‌పై న్యాయస్థానం నిర్ణయం 

    ఈ నేపథ్యంలో అవినీతి నిరోధక సంఘం (ACC) డిప్యూటీ డైరెక్టర్ మోనిరుల్ ఇస్లాం, హసీనా ఆస్తులను సీజ్ చేయాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

    ఈ కేసుపై మంగళవారం మెట్రోపాలిటన్‌ సీనియర్ ప్రత్యేక న్యాయమూర్తి జాకీర్ హుస్సేన్ విచారణ నిర్వహించి, హసీనా ఆస్తులను సీజ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

    ఈ ఆదేశాల ప్రకారం, హసీనా కుటుంబానికి చెందిన 'సుధాసదన్' భవనం సహా ఇతర ఆస్తులన్నింటినీ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి ఉంటుంది.

    హసీనా భర్త, దివంగత అణు శాస్త్రవేత్త ఎం.ఏ. వాజెద్ మియాకు 'సుధా మియా' అనే మరో పేరు ఉంది. అందుకే, ఆయన నివాసానికి 'సుధాసదన్' అనే పేరు పెట్టారు.

    వివరాలు 

    ప్రయాణ నిషేధం.. బ్యాంకు ఖాతాల జప్తు 

    హసీనా కుమారుడు సాజిబ్ వాజెద్ జాయ్, కుమార్తె సైమా వాజెద్ వుతుల్, సోదరి షేక్ రెహానా, ఆమె కుమార్తెలకు చెందిన ఆస్తులపై కూడా ప్రయాణ నిషేధం విధించారు.

    హసీనా, ఆమె కుటుంబ సభ్యుల 124 బ్యాంకు ఖాతాలను సీజ్ చేయాలని న్యాయస్థానం ఉత్తర్వులిచ్చింది. ఈ ఖాతాల్లో దాదాపు 600 కోట్ల బంగ్లాదేశ్ టాకా నిధులు ఉన్నట్టు తెలుస్తోంది.

    వివరాలు 

    హసీనా హయాం - అరెస్టు వారెంట్లు 

    హసీనా దేశం విడిచిన అనంతరం, మహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది.

    ఈ క్రమంలో, హసీనా ప్రభుత్వం హయాంలో మాజీ మంత్రులు, సలహాదారులు, అధికారులపై మానవత్వానికి విరుద్ధంగా నేరాలు చేశారని బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్‌ (ICT) వారెంట్ జారీ చేసింది.

    అలాగే, హసీనాను అప్పగించాలంటూ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం భారత ప్రభుత్వానికి లేఖ రాసింది.

    అయితే, దీనిపై భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి ఎటువంటి వ్యాఖ్య చేయలేమని ఇప్పటికే స్పష్టం చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    షేక్ హసీనా

    తాజా

    PBKS vs DC : పంజాబ్ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం ఢిల్లీ క్యాపిటల్స్
    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా

    షేక్ హసీనా

    Bangladesh: షేక్ హసీనా లండన్‌లో రాజకీయ ఆశ్రయం ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారు? అంతర్జాతీయం
    Hero Killed: అల్లరిమూకల విధ్వంసం.. హీరో, నిర్మాతను కొట్టి చంపిన ఆందోళన కారులు బంగ్లాదేశ్
    Muhammad Yunus : బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానికి నోబెల్ గ్రహిత మహ్మద్ యూనస్ నాయతక్వం బంగ్లాదేశ్
    Sheikh Hasina: షేక్ హసీనాకు ఆశ్రయం ఇచ్చేందుకు బ్రిటన్ నిరాకరణ.. ఇక భారత్‌లోనే భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025