Loading...
Sheikh Hasina: హసీనా బంగ్లాదేశ్‌కు వస్తే మరణశిక్ష తప్పదన్న ప్రాసిక్యూటర్
హసీనా బంగ్లాదేశ్‌కు వస్తే మరణశిక్ష తప్పదన్న ప్రాసిక్యూటర్

Sheikh Hasina: హసీనా బంగ్లాదేశ్‌కు వస్తే మరణశిక్ష తప్పదన్న ప్రాసిక్యూటర్

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 10, 2026
05:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా స్వదేశానికి తిరిగి వస్తే మరణశిక్షను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆ దేశ అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్ చీఫ్ ప్రాసిక్యూటర్ అమీనుల్ ఇస్లాం స్పష్టం చేశారు. ఆమెకు ఇక మరో మార్గం లేదని హెచ్చరించారు. బంగ్లాదేశ్‌కు తిరిగి రావాలనుకుంటే ఇప్పటికే వెలువడిన మరణశిక్ష తీర్పును ఎదుర్కోవాల్సిందేనని తేల్చిచెప్పారు. 2024 ఆగస్టులో బంగ్లాదేశ్‌లో జరిగిన ప్రజా ఉద్యమం కారణంగా షేక్ హసీనా అధికారాన్ని కోల్పోయారు. అనంతరం ఆమె భారత్‌కు వచ్చారు. అప్పట్లో నిరసనకారులపై జరిగిన అణచివేతకు సంబంధించి హసీనాపై మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. ఈ కేసును విచారించిన అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్ ఆమెకు మరణశిక్ష విధించింది.

వివరాలు 

హసీనా అభ్యర్థనను తిరస్కరించిన బంగ్లాదేశ్ ప్రభుత్వం

డిసెంబర్‌లో తిరిగి బంగ్లాదేశ్‌కు వెళ్లాలని భావిస్తున్నట్లు హసీనా గతంలో ప్రకటించారు.

అవసరమైతే కోర్టులో లొంగిపోయేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు రాయిటర్స్‌కు వెల్లడించారు.

ఈ నేపథ్యంలో సోమవారం ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్‌కు ఆమె ఒక లేఖ పంపించారు.

లండన్‌లోని తన న్యాయవాదుల ద్వారా పంపిన ఈ లేఖలో కొత్త పాస్‌పోర్టు, జాతీయ గుర్తింపు కార్డు జారీ చేయాలని కోరారు.

అయితే హసీనా అభ్యర్థనను బంగ్లాదేశ్ ప్రభుత్వం తిరస్కరించింది.

మరణశిక్ష పడిన వ్యక్తికి ప్రయాణ పత్రాలు జారీ చేయడానికి చట్టపరంగా ఎలాంటి అవకాశం లేదని అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్ చీఫ్ ప్రాసిక్యూటర్ అమీనుల్ ఇస్లాం పేర్కొన్నారు.

నిజంగా ఆమె స్వదేశానికి తిరిగి రావాలనుకుంటే భారత ప్రభుత్వాన్ని సంప్రదించాలని సూచించారు.

వివరాలు 

భారత్‌-బంగ్లాదేశ్ మధ్య ఉన్న అప్పగింత ఒప్పందమే ఏకైక మార్గం 

భారత్‌-బంగ్లాదేశ్ మధ్య ఉన్న అప్పగింత ఒప్పందం ప్రకారం తనను బంగ్లాదేశ్‌కు అప్పగించాలని భారత ప్రభుత్వాన్ని కోరాలని తెలిపారు.

మరోవైపు బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి హుమాయున్ కబీర్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు.

షేక్ హసీనా తిరిగి స్వదేశానికి రావడానికి భారత్‌-బంగ్లాదేశ్ మధ్య ఉన్న అప్పగింత ఒప్పందమే ఏకైక మార్గమని పేర్కొన్నారు.

ఈ పరిణామాలతో భారత్‌-బంగ్లాదేశ్ మధ్య ఇప్పటికే కొనసాగుతున్న దౌత్యపరమైన ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ADVERTISEMENT