LOADING...
US Army: అమెరికా సైనిక స్థావరంలో కాల్పుల కలకలం.. ఐదుగురు సైనికులకు గాయాలు!
అమెరికా సైనిక స్థావరంలో కాల్పుల కలకలం.. ఐదుగురు సైనికులకు గాయాలు!

US Army: అమెరికా సైనిక స్థావరంలో కాల్పుల కలకలం.. ఐదుగురు సైనికులకు గాయాలు!

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 07, 2025
01:41 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా జార్జియా రాష్ట్రంలోని ఫోర్ట్ స్టీవర్ట్ సైనిక స్థావరంలో గుర్తుతెలియని వ్యక్తి అకస్మాత్తుగా కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో మొత్తం ఐదుగురు సైనికులు గాయపడినట్టు సమాచారం. కాల్పులు ప్రారంభమైన వెంటనే ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సాయుధుడి అనుమానాస్పద కదలికలను గుర్తించిన అధికారులు అప్రమత్తమై వెంటనే ఫోర్ట్ స్టీవర్ట్‌ స్థావరంలోని ప్రవేశద్వారాలను పూర్తిగా మూసివేశారు. పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు కొంత ప్రాంతాన్ని లాక్‌డౌన్‌ చేశారు. స్థానిక ప్రజలకు తమ నివాసాల్లోనే ఉండాలని, తలుపులు మూసి ఉంచాలని, బయటకు రావద్దని అధికారుల నుండి హెచ్చరికలు జారీ అయ్యాయి.

వివరాలు 

అదుపులోకి నిందితుడు 

ఈ ఫోర్ట్ స్టీవర్ట్ స్థావరం అమెరికా సైన్యంలో మూడవ పదాతిదళ విభాగానికి చెందినది. వేలాది మంది సైనికులు,వారి కుటుంబ సభ్యులు ఇక్కడ నివసిస్తున్నారు. ఈ ఘటన కొద్దిసేపటికే నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అమెరికా సైనిక స్థావరంలో కాల్పుల కలకలం