తదుపరి వార్తా కథనం
Canada: టొరంటో పబ్‌లో కాల్పుల కలకలం.. 12 మందికి గాయాలు
వ్రాసిన వారు
Jayachandra Akuri
Mar 08, 2025
12:33 pm
ఈ వార్తాకథనం ఏంటి
కెనడాలో జరిగిన కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. టొరంటో నగరంలోని ఓ పబ్‌లో ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు.
ఈ ఘటనలో 12 మంది గాయపడినట్లు తెలుస్తోంది. స్థానిక మీడియా కథనాల ప్రకారం, శుక్రవారం రాత్రి 10:39 గంటల సమయంలో టొరంటో నగరంలోని స్కార్‌బరో టౌన్ సెంటర్ సమీపంలోని ఓ పబ్‌లో కాల్పులు చోటుచేసుకున్నాయి.
ఓ వ్యక్తి అకస్మాత్తుగా తుపాకీతో కాల్పులకు పాల్పడ్డాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు.
Details
క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించిన పోలీసులు
సమాచారం అందుకున్న టొరంటో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
కాల్పుల ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ దారుణంపై టొరంటో మేయర్ ఒలివియా చౌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు.