Page Loader
Simon Harris: చిన్న వయస్సులోనే ఐర్లాండ్ ప్రధానిగా ఎంపికైన సైమన్ హారిస్ 
Simon Harris: చిన్న వయస్సులోనే ఐర్లాండ్ ప్రధానిగా ఎంపికైన సైమన్ హారిస్

Simon Harris: చిన్న వయస్సులోనే ఐర్లాండ్ ప్రధానిగా ఎంపికైన సైమన్ హారిస్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 25, 2024
11:09 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐర్లాండ్ ప్రధాని లియో వరద్కర్ పదవి నుంచి వైదొలగడంతో సైమన్ హారిస్ ప్రధానమంత్రిగా నియమితులయ్యారు. లియో వరద్కర్ రాజీనామా అనంతరం ,37 ఏళ్ల యువ నేతకు బాధ్యతలు అప్పగించారు. ఫైన్ గేల్ పార్టీకి కొత్త నాయకుడిగా ఎన్నికైన తర్వాత హారిస్ ఇప్పుడు దేశంలోనే అత్యంత చిన్న వయస్కుడైన ప్రధానిగా అవతరించారు. సైమన్ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటాడు. ఐరిష్ మీడియా ఇప్పటికే అతనికి 'టిక్‌టాక్ టావోసీచ్' అని పేరు పెట్టింది. సైమన్ హారిస్ కంటే ముందు ఈ టైటిల్‌ను కలిగి ఉన్న అతి పిన్న వయస్కుడు లియో వరద్కర్. 2017లో 38 ఏళ్ల వయసులో ఈ పదవిని చేపట్టారు.

Details 

మీ నమ్మకాన్ని తిరిగి చెల్లిస్తా: సైమన్ హారిస్

వరద్కర్ ఆకస్మిక రాజీనామా తర్వాత, సైమన్ హారిస్ కి ప్రధాని అయ్యే అవకాశం వచ్చింది. ప్రధానమంత్రి పదవి కోసం హారిస్‌కు చాలా మంది పార్టీ సహచరుల మద్దతు లభించింది. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పార్టీ నాయకుడిగా నియమితులవడం తన జీవితంలో గొప్ప గౌరవమని అన్నారు. ఈ నేపథ్యంలో తనను ఎన్నుకున్న వారికి హారిస్ కృతజ్ఞతలు తెలియజేశారు. మీ నమ్మకాన్ని తిరిగి చెల్లిస్తానని అన్నారు. చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో చురుగ్గా ఉండే సైమన్ హారిస్.. చదువు పూర్తయ్యాక పార్టీ యువజన విభాగంలో చేరారు. అతి తక్కువ సమయంలోనే హారిస్ అంకిత భావంతో కూడిన రాజకీయ నాయకుడిగా నిరూపించుకున్నాడు. పార్టీలో ఆయన అనేక పాత్రలు పోషించారు.

Details 

ప్రస్తుతం విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సైమన్ 

హారిస్ రాజకీయ జీవితం గురించిమాట్లాడితే.. అయన 2016 నుండి 2020 వరకు ఐర్లాండ్ ఆరోగ్య మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించాడు. అయన పదవీకాలంలో, కోవిడ్-19 మహమ్మారి దేశంలో వ్యాపించింది, దీని నిర్వహణలో హారిస్ ముఖ్యమైన పాత్ర పోషించారు. ప్రస్తుతం విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తన హయాంలో, ఎన్నోసార్లు తన సత్తా ఏంటో నిరూపించుకున్నారు. భారత సంతతికి చెందిన ప్రధాని లియో వరద్కర్ హఠాత్తుగా తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాతో దేశం మొత్తం దిగ్భ్రాంతికి గురైంది. 45 ఏళ్ల వరద్కర్ తన రాజీనామా వెనుక రాజకీయ కారణాలను ఉదహరించారు. ఆ తర్వాత సైమన్ హారిస్ పార్టీకి అత్యున్నత నాయకుడిగా నియమితుడయ్యాడు.