Page Loader
Asif Bashir: భారతీయ యాత్రికులను కాపాడిన పాక్‌ అధికారికి 'సితారే-ఇంతియాజ్‌' పురస్కారం
భారతీయ యాత్రికులను కాపాడిన పాక్‌ అధికారికి 'సితారే-ఇంతియాజ్‌' పురస్కారం

Asif Bashir: భారతీయ యాత్రికులను కాపాడిన పాక్‌ అధికారికి 'సితారే-ఇంతియాజ్‌' పురస్కారం

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 25, 2025
04:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

గతేడాది హజ్‌ యాత్రలో తీవ్ర ఉష్ణోగ్రతల కారణంగా దాదాపు 1,300 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన తెలిసిందే. ఆ సమయంలో ప్రాణాలకు తెగించి ఎందరో యాత్రికులను రక్షించిన పాకిస్థాన్‌కు చెందిన అధికారి ఆసిఫ్‌ బషీర్‌కు ఆ దేశ మూడో అత్యున్నత పౌర పురస్కారం 'సితారే-ఇంతియాజ్‌'ను అందజేశారు. పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ ఈ పురస్కారాన్ని బషీర్‌కు బహూకరించారు. గతేడాది హజ్‌ యాత్రకు ప్రపంచవ్యాప్తంగా ఎందరో యాత్రికులు హాజరయ్యారు. తీవ్ర ఎండలు, ఉక్కపోత, మరియు వడగాలుల కారణంగా చాలా మంది అనారోగ్యానికి గురయ్యారు.

Details

యాత్రికులకు ప్రథమ చికిత్స అందించిన ఆసిఫ్ బషీర్

సౌదీ అధికారిక వర్గాల ప్రకారం 1,300 మందికి పైగా మరణించారు. ఈ దుర్ఘటన సమయంలో ఆసిఫ్‌ బషీర్‌ మీనా ప్రాంతంలో హజ్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అతను తన బృందంతో కలిసి అపస్మారక స్థితిలోకి వెళ్లిన అనేక యాత్రికులకు ప్రథమ చికిత్స అందించారు. ఆసిఫ్‌ బషీర్‌ తన బృంద సభ్యులతో కలిసి 17 మంది భారతీయులు సహా 26 మందిని భుజాలపై ఎత్తుకుని ఆస్పత్రులకు తరలించి వారి ప్రాణాలను కాపాడారు. ఈ సాహసోపేత సేవలకు గానూ ఆయన పాకిస్థాన్‌ ప్రభుత్వం నుంచి 'సితారే-ఇంతియాజ్‌' పురస్కారాన్ని అందుకున్నారు.