Loading...
Russia: రష్యాలో కుప్పకూలిన సైనిక విమానం.. ఆరుగురు మృతి,ఒకరికి గాయాలు
రష్యాలో కుప్పకూలిన సైనిక విమానం.. ఆరుగురు మృతి,ఒకరికి గాయాలు

Russia: రష్యాలో కుప్పకూలిన సైనిక విమానం.. ఆరుగురు మృతి,ఒకరికి గాయాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 30, 2026
08:28 am

ఈ వార్తాకథనం ఏంటి

రష్యాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. శిక్షణలో భాగంగా ప్రయాణిస్తున్న రష్యా సైనిక విమానం (Tu-95 బాంబర్) టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా.. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన తూర్పు రష్యాలోని అముర్ ప్రాంతంలో క్రాస్నోయరోవో గ్రామ సమీపంలో మంగళవారం (సెప్టెంబర్ 29) చోటుచేసుకుంది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక సమస్య కారణంగా విమానం కుప్పకూలినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రమాద సమయంలో విమానంలో మొత్తం ఏడుగురు ఉన్నారు. వారిలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో వ్యక్తి తీవ్ర గాయాలతో బయటపడ్డారు. అయితే విమానం జనావాసాలకు దూరంగా కూలిపోవడంతో భారీ ప్రాణ, ఆస్తి నష్టం తప్పింది.

వివరాలు 

సోషల్ మీడియాలో వైరల్‌గా ప్రమాదానికి సంబంధించిన వీడియోలు

ప్రమాద సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు.

సహాయక చర్యలు చేపట్టి గాయపడిన వ్యక్తిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

విమానం కూలిపోవడానికి అసలు కారణం ఏమిటనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

ఇదిలా ఉండగా.. విమాన ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

విమానం కుప్పకూలిన వెంటనే దాని ఇంధన ట్యాంకులు పేలడంతో భారీగా మంటలు చెలరేగిన దృశ్యాలు వీడియోల్లో కనిపిస్తున్నాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

టేకాఫ్ అయిన కాసేపటికే కుప్పకూలిన రష్యా సైనిక విమానం

ADVERTISEMENT