Page Loader
Luis Armando Albino: ఆరేళ్ల ప్రాయంలో కిడ్నాప్‌ అయ్యిన చిన్నారి .. ఏడు దశాబ్దాల తర్వాత..!
ఆరేళ్ల ప్రాయంలో కిడ్నాప్‌ అయ్యిన చిన్నారి .. ఏడు దశాబ్దాల తర్వాత..!

Luis Armando Albino: ఆరేళ్ల ప్రాయంలో కిడ్నాప్‌ అయ్యిన చిన్నారి .. ఏడు దశాబ్దాల తర్వాత..!

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 23, 2024
12:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

కొన్ని సంఘటనలు అర్థం కాకపోవడం సాధారణమే. మనం కొన్నిసార్లు వస్తువులు లేదా వ్యక్తులను పోగొట్టుకుంటాం, వాటి ఆచూకీ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తాం. చివరికి ఆశలు ఆవిరవుతాయి. అప్పుడు, ఒక అద్భుతం జరిగితే, ఆ వ్యక్తి లేదా వస్తువు మన వద్దకి వస్తే, అది ఆనందాన్ని తెస్తుంది. ఈ కథలో అలాంటి సంఘటన చోటుచేసుకుంది. గుండెల్ని పిండేసే ఉద్వేగభరితం లూయిస్ అర్మాండో అల్బినో ‍కథ..!

వివరాలు 

92 ఏళ్ల వయసులో తల్లి కన్నుమూత 

1951 ఫిబ్రవరి 21న కాలిఫోర్నియాలో, 10 సంవత్సరాల లూయిస్ తన సోదరుడు రోజర్‌తో కలిసి ఆడుకుంటుండగా, ఒక అపరిచిత మహిళ స్వీట్లు ఇస్తానని చెప్పి లూయిస్ అర్మాండో అల్బినో ని కిడ్నాప్ చేసింది. ఆ తరువాత, లూయిస్ ఆచూకీ మిస్టరీగా మారిపోయింది. గడిచిన సంవత్సరాలలో, అతని తల్లి 92 ఏళ్ల వయసులో కన్నుమూసినా, అతని మేనకోడలు అలిడా అలెక్విన్ మాత్రం లూయిస్ ఆచూకీ ఎలాగైన కనిపెట్టాలని ఎంతోగానో తప్పనపడింది. అతనికి సంబంధించిన పాత పేపర్ యాడ్‌లు, ఫోటోలను సేకరించి, డీఎన్‌ఏ పరీక్షలతో సహా అన్వేషణ ప్రారంభించింది. చివరకు, ఆమె కృషి ఫలించి, లూయిస్‌ను కనుగొంది. అతడు రిటైర్డ్ అగ్నిమాపక సిబ్బంది, మెరైన్‌ కార్ప్స్ నిపుణుడిగా పని చేస్తున్నట్లు తెలుసుకుంది.

వివరాలు 

82 సంవత్సరాల వయసులో లూయిస్‌ను కలిసిన రోజర్‌

అతడు వియత్నాంలో రెండు సార్లు పర్యటించినట్లు ఆమె తెలుసుకుంది. అతని డీఎన్‌ఏ కుటుంబ సభ్యుల డీఎన్‌ఏతో 22% సరిపోలడంతో, ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అలిడా తన మామ లూయిస్‌ను కుటుంబసభ్యులతో కలిపింది. రోజర్‌ 82 సంవత్సరాల వయసులో లూయిస్‌ను కలుసుకున్నాడు. అతను కేన్సర్‌తో బాధపడుతున్నట్లు తెలిసి బాధపడాడు, కానీ తన తమ్ముడిని కలుసుకోవడం అతనికి ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఈ సందర్భంగా , ఇద్దరు చిన్నప్పటి జ్ఞాపకాలను పంచుకున్నారు. అలిడా ఎంతగా శోధించిందంటే, స్థానిక లైబ్రరీలలో వార్తాపత్రికల ఆర్కైవ్‌లు, మైక్రోఫిల్మ్‌లతో కృషి చేసింది. చివరికి, లూయిస్ అల్బినో చిత్రాలను కనుగొని, దశాబ్దాల నాటి మిస్టరీని పరిష్కరించింది. తన మామను కుటుంబంతో కలిపింది అలిడా అలెక్విన్.