Philadelphia: ఫిలడెల్ఫియాలోని షాపింగ్ మాల్ సమీపంలో కూలిన విమానం.. ఆరుగురు మృతి
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలో మరో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఫిలడెల్ఫియా విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఒక విమానం కుప్పకూలింది.
ఈ ఘటనలో ఇప్పటివరకు ఆరుగురు మరణించినట్లు అధికారికంగా నిర్ధారించారు.
ఈ ఘటనకు రెండు రోజుల ముందు వాషింగ్టన్‌లోని రీగన్ నేషనల్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో ఓ ప్రయాణీకుల జెట్, మిలిటరీ హెలికాప్టర్ ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఆ ప్రమాదంలో 67 మంది ప్రాణాలు కోల్పోయారు.
వివరాలు
టేకాఫ్ అయిన కేవలం 30 సెకన్లలోనే కుప్పకూలిపోయింది
వార్తా సంస్థలు AFP, రాయిటర్స్ వెల్లడించిన వివరాల ప్రకారం, తాజా ప్రమాదంలో విమానం ఒక షాపింగ్ మాల్ సమీపంలో కూలిపోయింది.
ఈశాన్య ఫిలడెల్ఫియా విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఈ విమానం టేకాఫ్ అయిన కేవలం 30 సెకన్లలోనే కుప్పకూలిపోయింది.
ఈ ప్రమాదంలో అనేక భవనాలు మంటల్లో కాలిపోయాయి, పలువురు గాయపడ్డారు.
ఫిలడెల్ఫియా ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ కార్యాలయం ఈ ఘటనను సోషల్ మీడియా ద్వారా ధృవీకరించింది.
వివరాలు
వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్
ప్రమాదానికి గల అసలు కారణాలను వెలికితీసేందుకు సమగ్ర విచారణ చేపడతామని పెన్సిల్వేనియా గవర్నర్ జోష్ షాపిరో ప్రకటించారు.
ఈ ఘోర ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వేగంగా వైరల్ అవుతోంది.
ఓ ఇంట్లో అమర్చిన సీసీటీవీ కెమెరా ఈ ప్రమాదాన్ని పూర్తి స్థాయిలో రికార్డు చేసింది.
విమానం భవనంపై పడి క్షణాల్లోనే అగ్ని గోళంగా మారిపోయిందని సీసీటీవీ ఫుటేజీ స్పష్టంగా చూపిస్తోంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వైరల్ అవుతున్న వీడియో ఇదే
JUST IN: New video of the plane crash in Philadelphia. At least 6 people killed pic.twitter.com/zrX3jZcjoO
— BNO News (@BNONews) February 1, 2025