South Korea : దక్షిణ కొరియాలో దారుణం.. ప్రతిపక్ష నేత మెడపై కత్తితో దాడి..
దక్షిణ కొరియాలో దారుణం జరిగింది. ఈ మేరకు ప్రతిపక్ష నేత లీ జే-మ్యూంగ్‌పై((Lee Jae myung)) మంగళవారం బుసాన్‌లో గుర్తు తెలియని దుండగుడు తీవ్రంగా దాడి చేశాడు. ఈ క్రమంలోనే ఆయన మెడపై కత్తితో పొడిచినట్లు రాయిటర్స్ వెల్లడించింది. మంగళవారం లీ జే-మ్యుంగ్, దక్షిణ ఓడరేవు నగరమైన బుసాన్‌లోని ప్రతిపాదిత విమానాశ్రయ స్థలాన్ని సందర్శిస్తున్న నేపథ్యంలో గుర్తుతెలియని వ్యక్తి ఆయుధంతో దాడి చేశారు.ఘటనా స్థలంలోనే దుండగుడిని అదుపులోకి తీసుకున్నారు. జియోంగ్గీ ప్రావిన్స్ మాజీ గవర్నర్ లీజే, 2022 అధ్యక్ష ఎన్నికల్లో మాజీ చీఫ్ ప్రాసిక్యూటర్ యూన్ చేతిలో ఓడిపోయారు. డెమొక్రాటిక్ పార్టీ నేత లీ మ్యూంగ్ దాడి తర్వాత స్పృహలోనే ఉన్నారని అధికారులు తెలిపారు. రాజకీయ సంస్కర్త, అవినీతి నిర్మూలన నేతగా పేర్కొంటారు.