
Nobel 2024 - Literature: సాహిత్యంలో నోబెల్ బహుమతిని గెలుచుకున్న దక్షిణ కొరియా రచయిత్రి హాన్ కాంగ్
ఈ వార్తాకథనం ఏంటి
సాహిత్యంలో విశేష కృషి చేసినందుకు దక్షిణ కొరియా రచయిత్రి హాన్ కాంగ్ (Han Kang)కు ప్రతిష్ఠాత్మక నోబెల్ బహుమతి (Nobel Prize 2024) లభించింది.
మానవ జీవితపు దుర్బలత్వాన్ని, చారిత్రక విషాదాలను ఆమె తన గద్య కవిత్వంతో కళ్లకు కట్టారని స్వీడిష్ అకాడమీ పేర్కొంది.
అంతకుముందు ఏడాది (2023) నార్వేకు చెందిన రచయిత జాన్ ఫోసె (Jon Fosse) ఈ బహుమతి పొందారు.
వైద్య విభాగంతో మొదలైన నోబెల్ పురస్కారాల ప్రదానం అక్టోబర్ 14వరకు కొనసాగనుంది.
వైద్య,భౌతిక,రసాయన శాస్త్రాల్లో నోబెల్ గ్రహీతల పేర్లను ఇప్పటికే వెల్లడించారు.నేడు సాహిత్యంలో విజేతను ప్రకటించారు.
శుక్రవారం నాడు నోబెల్ శాంతి బహుమతి(Nobel Peace Prize 2024)ని ప్రకటించనున్నారు.అలాగే అక్టోబర్ 14న అర్థశాస్త్రంలో నోబెల్ గ్రహీతల పేర్లను వెల్లడిస్తారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
నోబెల్ ప్రైజ్ చేసిన ట్వీట్
BREAKING NEWS
— The Nobel Prize (@NobelPrize) October 10, 2024
The 2024 #NobelPrize in Literature is awarded to the South Korean author Han Kang “for her intense poetic prose that confronts historical traumas and exposes the fragility of human life.” pic.twitter.com/dAQiXnm11z
వివరాలు
ఆల్‌ఫ్రెడ్ నోబెల్ పేరు మీద అవార్డు
స్వీడన్‌కు చెందిన శాస్త్రవేత్త, ఇంజినీర్, వ్యాపారవేత్త ఆల్‌ఫ్రెడ్ నోబెల్ పేరు మీదుగా ప్రపంచంలో వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఈ అవార్డును ప్రదానం చేస్తున్నారు.
1896లో ఆల్‌ఫ్రెడ్ నోబెల్ మరణించగా, 1901 నుండి ఆయన ట్రస్ట్ ద్వారా ఈ అవార్డులను ప్రతి సంవత్సరం ప్రదానం చేస్తున్నారు.
అవార్డు గ్రహీతలకు 11 లక్షల స్వీడిష్ క్రోనర్ (10 లక్షల డాలర్లు) నగదు అందుతుంది. వీటిని డిసెంబర్ 10న అవార్డు గ్రహీతలకు అందజేస్తారు.