South Korea: దక్షిణ కొరియా అధ్యక్షుడికి షాకిచ్చిన కోర్టు.. అరెస్ట్ వారెంట్ జారీ
ఈ వార్తాకథనం ఏంటి
దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌కు అక్కడి కోర్టు ఊహించని షాక్ ఇచ్చింది.
ఎమర్జెన్సీ విధించిన కేసు విషయంలో యోల్‌ను అరెస్ట్ చేయడానికి కోర్టు వారెంట్ జారీ చేసింది.
దర్యాప్తు సంస్థలు ఆయనను అదుపులోకి తీసుకోవాలని కోర్టును అభ్యర్థించగా, కోర్టు ఆ విజ్ఞప్తిని అంగీకరించింది.
డిసెంబర్ 3న దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించి సంచలనానికి కారణమైన యోల్‌పై ప్రస్తుతం పోలీసులు, రక్షణ మంత్రిత్వ శాఖ, అవినీతి నిరోధక శాఖల అధికారి బృందం విచారణ చేపట్టింది.
ఈ కేసులో ఇప్పటికే మూడుసార్లు పిలిచినప్పటికీ యోల్ విచారణకు హాజరుకాలేదు.
ఈ పరిస్థితిలోనే పోలీసులు కోర్టును సంప్రదించి అరెస్ట్ వారెంట్ కోరారు.
వివరాలు
పార్లమెంట్‌లో అభిశంసన తీర్మానం
విచారణలో నేరం రుజువైతే యోల్‌కు జీవితఖైదు లేదా మరణశిక్ష విధించే అవకాశం ఉంది.
మరోవైపు, దేశంలో మార్షల్ లా అమలు చేసినందుకు యోల్‌పై విపక్షాలు పార్లమెంట్‌లో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాయి.
తీర్మానానికి అనుకూలంగా 204 మంది ఓటు వేయగా, 85 మంది మాత్రమే వ్యతిరేకించారు.
ఈ నేపథ్యంలో, యోల్ తన అధ్యక్ష అధికారాలను ప్రధానమంత్రికి అప్పగించాల్సి ఉంటుంది.
తీర్మానం కాపీని పార్లమెంట్ రాజ్యాంగ కోర్టుకు పంపగా, యోల్ భవిష్యత్తును రాజ్యాంగ కోర్టు 180 రోజుల్లోగా నిర్ణయిస్తుంది.