గిన్నిస్ బుక్ రికార్డు: ప్రపంచంలోనే అతిపెద్ద కిడ్నీ రాయిని తొలగించిన శ్రీలంక వైద్యులు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచంలోనే అతిపెద్ద కిడ్నీ రాయిని తొలగించి శ్రీలంక ఆర్మీ వైద్యుల బృందం గిన్నిస్ రికార్డు సృష్టించింది.
2004లో భారతీయ వైద్యులు నమోదు చేసిన రికార్డును శ్రీలంక డాక్టర్లు అధిగమించారు.
కొలంబో ఆర్మీ ఆసుపత్రిలో ఈ నెల ప్రారంభంలో 13.372 సెంటీమీటర్ల పొడవు, 801 గ్రాముల బరువు ఉన్న కిడ్నీస్టోన్‌ను తమ వైద్యులు తొలగించినట్లు శ్రీలంక సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది.
ఇప్పటికే నమోదైన గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం, ప్రపంచంలోనే అతి పెద్ద కిడ్నీ రాయి 2004లో వైద్యులు గుర్తించారు. అది దాదాపు 13 సెంటీమీటర్లు ఉంది.
అయితే 620 గ్రాముల బరువున్న అత్యంత బరువైన కిడ్నీ రాయి కేసు మాత్రం 2008లో పాకిస్థాన్‌లో నమోదైంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
శ్రీలంక ఆర్మీ వైద్యుల ఘనత
#SriLanka Army doctors have set a #GuinnessWorldRecord after removing the worlds largest & heaviest Kidney stone. pic.twitter.com/vzQhVH90of
— IANS (@ians_india) June 14, 2023