Page Loader
శాన్‌ఫ్రాన్సిస్కోలో కాన్సులేట్‌ జనరల్‌గా తెలుగు వ్యక్తి.. బాధ్యతలు స్వీకరించిన శ్రీకర్ రెడ్డి
బాధ్యతలు స్వీకరించిన శ్రీకర్ రెడ్డి

శాన్‌ఫ్రాన్సిస్కోలో కాన్సులేట్‌ జనరల్‌గా తెలుగు వ్యక్తి.. బాధ్యతలు స్వీకరించిన శ్రీకర్ రెడ్డి

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Aug 22, 2023
05:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

అగ్రరాజ్యం అమెరికాలో భారత కొత్త కాన్సులేట్‌ జనరల్‌గా తెలుగు వ్యక్తి నియామకమయ్యారు. ప్రపంచానికే ఐటీ కేంద్రం(సిలికాన్ వ్యాలీ)గా గుర్తింపు పొందిన నగరం శాన్‌ఫ్రాన్సిస్కోలో శ్రీకర్‌ రెడ్డి పనిచేయనున్నారు. శ్రీకర్‌ రెడ్డి స్వస్థలం, తెలంగాణలోని యాదాద్రి జిల్లా మోత్కూరు మండలం పరిధిలోని కొండగడప గ్రామం. కాకతీయ వర్సిటీలో మెడిసిన్‌ చదివిన శ్రీకర్‌, యూపీఎస్సీ పరీక్ష ద్వారా ఐఎఫ్‌ఎస్‌(IFS) సర్వీసుకు ఎంపికయ్యారు. అనంతరం విదేశీ వ్యవహారాల శాఖలో పలు హోదాల్లో సేవలందించారు. జర్మనీలోని బెర్లిన్‌లోనూ శ్రీకర్‌రెడ్డి పనిచేశారు. ప్రస్తుతం భారత్‌లో సంయుక్త కార్యదర్శిగా పనిచేస్తున్నారు.

DETAILS

 రాష్ట్రానికి గర్వకారణం : తెలంగాణ డీజీపీ

శ్రీకర్ రెడ్డి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పాస్‌ పోర్ట్‌ అధికారిగా విధులు నిర్వర్తించారు. శాన్‌ఫ్రాన్సిస్కోలో కాన్సుల్‌ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. వేలాది మంది తెలుగు వారు ఇక్కడ టెకీలుగా ఉన్నారని, భారత్‌, అమెరికా దేశాల మధ్య సంబంధాల మెరుగుపర్చేందుకు కృషి చేస్తానన్నారు. అమెరికా వీసాల కోసం తాకిడి పెరుగుతున్న దృష్ట్యా, ఆ విషయాన్ని అమెరికా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామన్నారు. విద్యార్థుల డీపోర్టేషన్‌ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన చెప్పుకొచ్చారు. మరోవైపు తెలంగాణకు చెందిన శ్రీకర్ రెడ్డి శాన్ ఫ్రాన్సిస్కోలో కాన్సులేట్ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించడం పట్ల డీజీపీ అంజనీ కుమార్‌ సంతోషం వ్యక్తం చేశారు. ఇది తమకు గర్వ కారణమని ఆయనకు అభినందనలు తెలియజేశారు.