Page Loader
Steve Wozniak:ఆపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ వోజ్నియాక్ కి స్ట్రోక్‌ 
Steve Wozniak:ఆపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ వోజ్నియాక్ కి స్ట్రోక్‌

Steve Wozniak:ఆపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ వోజ్నియాక్ కి స్ట్రోక్‌ 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 09, 2023
10:21 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ వోజ్నియాక్ స్ట్రోక్ కారణంగా బుధవారం మెక్సికో నగరంలో ఆసుపత్రిలో చేరినట్లు మెక్సికన్ మీడియా సంస్థలు నివేదించాయి. 73 ఏళ్ల శాస్త్రవేత్త,టెక్ వ్యవస్థాపకుడు మెక్సికన్ రాజధాని శాంటా ఫే పరిసరాల్లో వరల్డ్ బిజినెస్ ఫోరమ్ ఈవెంట్‌లో పాల్గొనాల్సి ఉంది. వోజ్నియాక్ బుధవారం సాయంత్రం 4:20 గంటలకు సమావేశంలో మాట్లాడాల్సి ఉండగా ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. అయితే, ఈ విషయమై కార్యక్రమ నిర్వాహకులు,రాయిటర్స్ గాని ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చెయ్యలేదు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

యాపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ వోజ్నియాక్ కి స్ట్రోక్‌