Page Loader
టైటాన్‌లో వెళ్లేందుకు భయపడ్డ సులేమాన్.. ఫాదర్స్ డే కోసమే ట్రిప్ ఒప్పుకున్న కుమారుడు 
ఫాదర్స్ డే కోసమే ట్రిప్ ఒప్పుకున్న కుమారుడు

టైటాన్‌లో వెళ్లేందుకు భయపడ్డ సులేమాన్.. ఫాదర్స్ డే కోసమే ట్రిప్ ఒప్పుకున్న కుమారుడు 

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jun 23, 2023
04:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

అట్లాంటిక్ స‌ముద్ర గ‌ర్భంలో టైటాన్ జలాంతర్గామి పేలిపోయి ప్రపంచవ్యాప్తంగా విషాదం నింపింది. అయితే అందులో పాకిస్థాన్ కు చెందిన బిలియ‌నీర్ తండ్రీ కుమారులు ఉన్న విషయం తెలిసిందే. పాక్ కోటీశ్వరుడు, 48 ఏళ్ల ష‌హ‌జాదా దావూద్ సహా ఆయ‌న కుమారుడు 19 ఏళ్ల సులేమాన్ దావూద్ ట్రిప్‌ కోసం వెళ్లి దుర్గటనలో ప్రాణాలు విడిచారు. ఫాదర్స్ డే సందర్భంగా తండ్రి కోరిక‌ను తీర్చేందుకే సులేమాన్ టైటాన్ ట్రిప్‌కు ఒప్పుకున్నాడని అత‌ని మేనేత్త అజ్మే దావూద్ తెలిపారు. వ్యక్తిగతంగా సులేమన్ కు సముద్ర గర్భంలోకి వెళ్లడం అంటే చాలా భయమని ఆమె వివరించారు. కానీ తండ్రీ కొడుకులు ఇద్ద‌రూ ఇలా జ‌ల‌స‌మాధి అవుతారని అనుకోలేదని బోరుమన్నారు.

DETAILS

షహ‌జాద్‌కు టైటానిక్ సాహసయాత్ర అంటే చాలా ఇష్ట‌ం : సోద‌రి అజ్మే

తన సోద‌రుడు షహ‌జాద్‌కు టైటానిక్ సాహసయాత్ర అంటే చాలా ఇష్ట‌మ‌ని సోదరి అజ్మే వివరించారు. అయితే తండ్రిని మాటకు విలువిచ్చి టైటాన్ ట్రిప్‌ కోసం సులేమాన్ ఒప్పుకున్న‌ాడన్నారు. ఈ ఘటన తమ కుటుంబానికి తీవ్ర విషాదాన్ని మిగిల్చిందని షహ‌జాద్ దావూద్ సోద‌రి అజ్మే విషాదం వ్యక్తం చేశారు. సముద్ర గర్బంలో తీవ్ర‌మైన నీటి ఒత్తిడి వ‌ల్ల టైటాన్ స‌బ్ మెరైన్ స‌ముద్రంలో పేలిపోయింది. ఘ‌ట‌న‌లో మొత్తం అయిదుగురు మృతి చెందారని అమెరికన్ కోస్ట్‌ గార్డ్ వెల్లడించింది. టైటానిక్‌కు 488 మీటర్ల దూరంలో శకలాలను గుర్తించామని రియర్ అడ్మిరల్ జాన్ మౌగర్ స్పష్టం చేశారు. ఈ విషాద సమాచారాన్ని బాధిత కుటుంబీకులకు అందించినట్లు పేర్కొన్నారు.