Page Loader
Predator drone: చైనా కదలికలపై నిఘా - ప్రిడేటర్‌ డ్రోన్లతో భారత్‌ సన్నాహాలు 
చైనా కదలికలపై నిఘా - ప్రిడేటర్‌ డ్రోన్లతో భారత్‌ సన్నాహాలు

Predator drone: చైనా కదలికలపై నిఘా - ప్రిడేటర్‌ డ్రోన్లతో భారత్‌ సన్నాహాలు 

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 16, 2024
03:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రిడేటర్ డ్రోన్ల వినియోగం రెండు విధాలుగా కీలకంగా మారనుంది. ఇవి అటు ఇంటెలిజెన్స్ సమాచార సేకరణలోనూ, శత్రువును గుర్తించి దాడులు చేయడంలోనూ కీలక పాత్ర పోషించనున్నాయి. యుద్ధ క్షేత్రాల్లో ఖచ్చితమైన సమాచారం అత్యవసరం. ప్రిడేటర్‌ డ్రోన్లు ఈ అవసరాన్ని తీర్చడంలో భారత్‌కు కీలక పాత్ర పోషించనున్నాయి. సరిహద్దుల్లో ఉగ్రశక్తుల కదలికలను పసిగట్టి, ఆయుధాలను సమర్థవంతంగా వినియోగించడంలో ఇవి సహాయపడతాయి. తాజా డ్రోన్ల కొనుగోలుతో భారత్ సరిహద్దుల్లో తన ఆధిపత్యాన్ని పెంచుకోనుంది. భారతదేశానికి సరిహద్దుల్లో చైనా, పాకిస్థాన్ వంటి దేశాల డ్రోన్లు ఉన్నప్పటికీ, ప్రిడేటర్‌ల రాకతో సరిహద్దు ప్రాంతాల్లో పరిస్థితులు మునుపటి కంటే మరింత వ్యూహాత్మకంగా మారనున్నాయి.

Details

నిఘా కోసం ఉపయోగపడతాయి

చైనా, పాకిస్థాన్ సరిహద్దుల్లోని కదలికలను, రాకెట్లను, మిసైల్ వ్యవస్థలను వీటితో పసిగట్టి అత్యవసర సమయంలో ప్రత్యర్థులపై దాడి చేయడం వీటి సామర్థ్యంలోని ఒక భాగం. భారత్ ఇప్పటికే రెండు స్కైగార్డియన్ డ్రోన్లను లీజుపై తీసుకొచ్చి తూర్పు లద్దాఖ్‌లో చైనా కదలికలను పర్యవేక్షించింది. తాజాగా తమిళనాడు, గుజరాత్, యూపీ వంటి ప్రధాన ప్రాంతాల్లో వీటిని మోహరించే అవకాశం ఉంది. ప్రత్యేకంగా యూపీలోని సైనిక స్థావరాలు చైనా, పాకిస్థాన్‌పై నిఘా కోసం ఉపయోగపడతాయి. ప్రిడేటర్ డ్రోన్లు సుదీర్ఘకాలం గగనతలంలో ఉండగలవు. 50,000 అడుగుల ఎత్తులో 35 గంటలు నిరంతరాయంగా ఎగరగల వీటి సామర్థ్యంతో భారత్ సరిహద్దులపై మరింత సురక్షితంగా ఉంటుంది. ఈ డ్రోన్లు అమెరికా హెల్‌ఫైర్ క్షిపణులను ప్రయోగించే సామర్థ్యం కూడా కలిగి ఉన్నాయి