LOADING...
Terror attack: జెరూసలెంలో ఉగ్రదాడి.. ఐదుగురి మృతి
జెరూసలెంలో ఉగ్రదాడి.. ఐదుగురి మృతి

Terror attack: జెరూసలెంలో ఉగ్రదాడి.. ఐదుగురి మృతి

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 08, 2025
04:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇజ్రాయెల్ రాజధాని జెరూసలెం నగరంలోని రామోట్ ప్రాంతంలో దారుణమైన దాడి చోటుచేసుకుంది. పట్నపగలు కాల్పుల కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ దాడిలో ఐదుగురు మృతి చెందగా, 15 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో ఏడుగురి పరిస్థితి తీవ్రంగా ఉంది. ఈ దాడికి హమాస్ బాధ్యత వహించింది. దాడి అనంతరం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అత్యవసర భద్రతా సమావేశాన్ని నిర్వహించినట్లు వివిధ మీడియా నివేదికలు వెల్లడించాయి.

వివరాలు 

దాడి ఎక్కడ, ఎలా జరిగిందంటే... 

జెరూసలెం రామోట్ ప్రాంతంలోని ఒక బస్ స్టాప్ వద్ద మద్యాహ్నం ఇద్దరు దుండగులు ఒక బస్సు ఎక్కి కాల్పులు ప్రారంభించారు. భద్రతా దళాలు త్వరితగతిన స్పందించి ఇద్దరినీ అక్కడికక్కడే హతమార్చాయి. ఈ దుండగులు వెస్ట్ బ్యాంక్‌కు చెందిన పాలస్తీనియన్లు అని భద్రతా అధికారులు నిర్ధారించారు. పోలీసులు ఈఘటనపై విస్తృతంగా దర్యాప్తు నిర్వహిస్తున్నారు. జెరూసలెంలో జరిగిన ఈ దాడిని హమాస్ సంస్థ ప్రశంసించింది. హమాస్ నాయకత్వం ఈ దాడిని వీరోచిత ఆపరేషన్ గా పేర్కొంది. "ఈదాడి మన ప్రజలపై జరిగిన విధ్వంసక యుద్ధానికి ప్రత్యుత్తరం"అని హమాస్ ఒక ప్రకటనలో పేర్కొంది. 2024 అక్టోబర్ నెలలో జరిగిన దాడి తర్వాత ఇది ఇజ్రాయెల్ లో జరిగిన అతిపెద్ద కాల్పుల సంఘటనగా నిలిచింది.

వివరాలు 

పోలీసులు,భద్రతా దళాలు విస్తృత దర్యాప్తు

గత సంవత్సరం కూడా వెస్ట్ బ్యాంక్‌కు చెందిన రెండు పాలస్తీనియన్లు టెల్ అవీవ్ రైల్వే స్టేషన్ పై కాల్పులు జరిపి 7గురిని హత్య చేశారు. ఆ దాడికి కూడా హమాస్ బాధ్యత వహించింది. రామోట్ జంక్షన్ కాల్పులపై పోలీసులు,భద్రతా దళాలు విస్తృత దర్యాప్తు చేపట్టాయి. దేశ వ్యాప్తంగా భద్రతా దళాలు హై అలర్ట్‌ లో కొనసాగుతున్నాయి. కాల్పుల తర్వాత ఇజ్రాయెల్ సైన్యం వెస్ట్ బ్యాంక్‌లోని రామల్లా,పరిసర ప్రాంతాలలోని అనేక పాలస్తీనా గ్రామాల్లో గస్తీని పెంచింది. తాజా సమాచారం ప్రకారం,దాడికి పాల్పడ్డ వారు ఈ గ్రామాల నుంచి జెరూసలేం చేరినట్టు భద్రతా దళాలు అనుమానిస్తున్నాయి. ఇజ్రాయెల్ జాతీయ భద్రతా మంత్రి ఇటమార్ బెన్ గ్విర్ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

జెరూసలెంలో ఉగ్రదాడి